Ad Code

నెంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సప్ !


వాట్సప్‌లో ఎవరికైనా మెసేజ్ పంపాలంటే ముందుగా వారి మొబైల్ నెంబర్‌ను స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేయాల్సి ఉంటుంది. అయితే కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేయకుండా కూడా స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాట్సప్‌లో మెసేజ్ పంపొచ్చు. మెటా యాజమాన్యానికి చెందిన వాట్సప్ ఇలాంటి అద్భుతమైన ఫీచర్స్ ఎన్నో అందిస్తోంది. వాట్సప్ అందిస్తున్న ఈ ఫీచర్స్ గురించి యూజర్లకు పూర్తిగా అవగాహన లేక వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేయకుండా వాట్సప్‌లో మెసేజ్ పంపొచ్చన్న విషయం అందరికీ తెలియదు. ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్‌లో పనిచేయదు. ఇందుకోసం మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో వాట్సప్ డెస్క్‌టాప్ యాప్ ఉపయోగించాల్సి ఉంటుంది. వాట్సప్ డెస్క్‌టాప్ యాప్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు ఎవరి నెంబర్‌కు వాట్సప్ మెసేజ్ పంపాలనుకున్నా పంపొచ్చు. వారి నెంబర్ మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉండాల్సిన అవసరం లేదు. మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత https://wa.me/ అని టైప్ చేసి ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్‌లో కంట్రీకోడ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. https://wa.me/919999999999 అని టైప్ చేసి యూఆర్‌ఎల్‌లో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Continue to Chat పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Open WhatsApp క్లిక్ చేస్తే వాట్సప్ డెస్క్‌టాప్ యాప్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఛాటింగ్ చేయొచ్చు. మీరు ఆ వాట్సప్ నెంబర్‌కు రెగ్యులర్‌గా ఛాటింగ్ చేసేటట్టైతే నెంబర్ సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటి అనేక ఫీచర్స్ వాట్సప్‌లో ఉన్నాయి. మరిన్ని కొత్త ఫీచర్స్ అందించేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కూడా రిలీజ్ చేసింది. అలాంటి వాటిలో మల్టీ డివైజ్ ఫీచర్ కూడా ఒకటి. ఒక యూజర్ తన వాట్సప్ అకౌంట్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌లల్లో ఉపయోగించుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీంతో పాటు వాట్సప్‌లో స్టిక్కర్స్‌ని ఫార్వర్డ్ చేసేందుకు కొత్త షార్ట్ కట్ రూపొందించింది వాట్సప్. ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది.

Post a Comment

0 Comments

Close Menu