Ad Code

నీట్‌కు ప్రిపేర్ అవుతున్నారా?


మీరు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) 2022 ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారా? జేఈఈ మెయిన్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారా? మీ ప్రిపరేషన్‌కు ఉపయోగపడే యాప్ ఒకటి ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రూపొందించిన నేషనల్ టెస్టింగ్ అభ్యాస్ యాప్‌లో మీరు ఉచితంగా మాక్ టెస్టులు రాయొచ్చు. మీకు వీలున్నప్పుడు కంప్యూటర్ బేస్ట్ టెస్ట్స్‌కు అటెండ్ కావొచ్చు. మాక్ టెస్టులు ఎక్కువగా అటెండ్ అవుతుంటే అసలు పరీక్షలు కంగారు పడకుండా సులువుగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. ఈ యాప్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి? ఏఏ ఎగ్జామ్స్ ఉంటాయో తెలుసుకోండి. విద్యార్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి అవగాహన కల్పించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ టెస్టింగ్ అభ్యాస్ యాప్‌ను రూపొందించింది. విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్‌లో ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేయొచ్చు. యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ప్రతీ రోజూ కొత్తకొత్త మాక్ టెస్టులు అందుబాటులో ఉంటాయి. నీట్‌తో పాటు ఐఐటీ జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యేవారికి నేషనల్ టెస్టింగ్ అభ్యాస్ యాలో మాక్ టెస్టులు ఉంటాయి. హిందీ లేదా ఇంగ్లీష్‌లో ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. త్వరలో మరిన్ని పరీక్షలకు ఈ యాప్‌లో మాక్ టెస్టులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో మాక్ టెస్ట్ అటెండ్ అయిన తర్వాత ఫలితాలు వెంటనే కనిపిస్తాయి. ఈ యాప్‌లో ప్రతీ మాక్ టెస్టుకు ప్రశ్నలు వేర్వేరుగా ఉంటాయి. డిఫికల్టీ లెవెల్ అంటే ప్రశ్నలు ఎంత కఠినంగా ఉండాలో కూడా ఎంచుకోవచ్చు. ఈ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేస్తూ కఠిన ప్రశ్నలకు సమాధనాలు ఇస్తూ ఉంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అసలు పరీక్షలో మంచిగా పర్ఫామ్ చేయడానికి ఈ మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మాక్ టెస్టులకు అటెండ్ అయిన విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిటిక్స్ ద్వారా ఫీడ్ బ్యాక్ కూడా లభిస్తుంది. ఈ మాక్ టెస్టులు ఐఐటీ జేఈఈ మెయిన్స్, నీట్ లాంటి పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు పొందడానికి ఉపయోగపడతాయి. ఎక్కడ తప్పులు చేశారో విశ్లేషించుకోవచ్చు. ప్రశ్నలవారీగా విశ్లేషణ చేయొచ్చు. టైమ్ మేనేజ్‌మెంట్ వ్యూహాలను కూడా రూపొందించుకోవచ్చు. టైమ్ మేనేజ్‌మెంట్, స్పీడ్, యాక్యురసీ పెంచుకోవచ్చు. డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని విద్యార్థులకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మాక్ టెస్టుల కోసం ఇతర వెబ్‌సైట్లలో లాగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ యాప్‌లో మాక్ టెస్టులు మాత్రమే కాదు... ప్రస్తుత సిలబస్, గతంలో వచ్చిన ప్రశ్నా పత్రాలు ఉంటాయి. ప్రతీ పేపర్‌కు సొల్యూషన్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతీ టెస్టులో ప్రశ్నల వారీగా విశ్లేషణ, వివరణ, సొల్యూషన్ ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu