Ad Code

'ప్రైవసీ' చిక్కుల్లో సుందర్‌ పిచాయ్‌ ?

 

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కొత్త చిక్కుల్లో పడ్డారు. యూజర్ల ప్రైవసీ విషయంలో గూగుల్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ పిచాయ్ కోర్టు విచారణను ఎదుర్కోనున్నారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ బ్రౌజింగ్ విషయంలో ప్రైవసీ ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయి. యూజర్ల ప్రైవసీపరంగా గూగుల్ నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఒకరు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. Incognito బ్రౌజింగ్ మోడ్ ద్వారా Alphabet .Inc యూజర్ల ఇంటర్నెట్ వినియోగాన్ని చట్టవిరుద్ధంగా గూగుల్ ట్రాక్ చేసినట్లు ఆరోపిస్తూ.. జూన్ 2020లోనే దావా దాఖలైంది. ఇప్పుడు దానిపై విచారించిన కోర్టు.. సుందర్ పిచాయ్‌ను యూజర్ల ప్రైవసీ విషయంలో రెండు గంటల పాటు ప్రశ్నించాలని తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి పిచాయ్‌ని కోర్టు ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో యూజర్లు ప్రైవేట్ మోడ్‌ వినియోగించినప్పుడు.. యూజర్లకు తెలియకుండా ఇంటర్నెట్ వినియోగాన్ని గూగుల్ ట్రాక్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై గూగుల్‌ సీఈవో సుందర్‌కు ముందుగానే తెలుసునని కోర్టులో వాదించారు. ప్రైవేట్‌ మోడ్‌లో యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించేలా గూగుల్ వ్యవహరించిందని సదరు వ్యక్తి ఆరోపించారు. ఈ ఆరోపణలపై గూగుల్ స్పందించింది. సదరు వ్యక్తి చేసిన ఆరోపణలు అవాస్తవమైనవని గూగుల్ ప్రతినిధి జోస్ కాస్టానెడా స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రైవసీ ఆరోపణలపై గూగుల్ సమాధానం ఇచ్చిందని అన్నారు. గూగుల్‌ క్రోమ్‌ Incognito బ్రౌజింగ్‌ కు సంబంధించి 2019లోనే పిచాయ్‌ యూజర్లను హెచ్చరించారు. Incognito Mode సమస్యాత్మకమైనదిగా తెలిపారు. Incognito Mode అనేది కేవలం యూజర్ల డేటాను సేవ్‌ చేయకుండా మాత్రమే అడ్డుకోగలదని గూగుల్ స్పష్టం చేసింది. ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌లోనే.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఆన్‌లైన్‌లోనే గడిపేస్తుంటారు. క్షణం తీరిక లేకుండా ఏదేదో ఇంటర్నెట్లో వెతికేస్తుంటారు. వందలాది సైట్లను తెగ చూసేస్తుంటారు. ఆన్ లైన్లో మనం ఏం సెర్చ్ చేస్తున్నామో ఎవరికి తెలియదనుకోవడం పొరపాటే.. మీరు సెర్చ్ చేసే ప్రతిదీ గూగుల్ కంట పడుతునే ఉంటుంది. కొంతమంది Incognito మోడ్ ద్వారా విజిట్ ఇస్తే.. ఎవరూ ట్రాక్ చేయలేరని భ్రమ పడుతుంటారు. వాస్తవానికి ఇంటర్నెట్లో యూజర్ల ప్రైవసీకి కచ్చితమైన భద్రత లేదనే చెప్పాలి. ఎంతగా భద్రత కల్పించినప్పటికీ కూడా ఏదో ఒక లూప్ హోల్ ద్వారా యూజర్ల ప్రైవసీ డేటా బహిర్గతమవుతోనే ఉంటోంది. ఇప్పుడు ఇలాంటి సమస్యనే గూగుల్ ఎదుర్కొంటోంది. యూజర్ల ప్రైవసీకి సంబంధించి విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రైవసీ ఉల్లంఘన విషయంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ను కాలిఫోర్నియా కోర్టు ప్రశ్నించనుంది.

Post a Comment

0 Comments

Close Menu