Ad Code

ధర చాలా ఎక్కువ...!


భారత్‌లో హెచ్‌పీ ఒమెన్ 16 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను కంపెనీ లాంఛ్ చేసింది. న్యూ హెచ్‌పీ గేమింగ్ ల్యాప్‌టాప్ 11 జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో 16.1 ఇంచ్ డిస్‌ప్లేతో క్యూహెచ్‌డీ రిజల్యూషన్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ ల్యాప్‌టాప్ సింగిల్ చార్జ్‌పై 9 గంటల పాటు నడిచే బ్యాటరీ బ్యాకప్‌ను కలిగిఉంది. కేవలం 2.3 కిలోల బరువుతో ఒమెన్ 16 అత్యంత తేలికపాటి గేమింగ్ ల్యాప్‌టప్ అని హెచ్‌పీ వెల్లడించింది. ఓషన్ బౌండ్ ప్లాస్టిక్‌లు, రీసైక్లింగ్ మెటీరియల్స్‌తో పీసీ డిజైన్ చేసి పర్యావరణ అనుకూల డివైజ్‌గా మలిచామని కంపెనీ తెలిపింది. హెచ్‌పీ ఒమెన్ 16 రూ 1,39,999 ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉంది. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ హెచ్‌పీ వరల్డ్ స్టోర్స్‌, హెచ్‌పీ ఆన్‌లైన్ స్టోర్‌, ఇతర ప్రముఖ రిటైల్‌, ఆన్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu