సోలార్ పవర్ ఉత్పత్తిలో ఐఐటీ గుహాటీ ముందడుగు !


పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి దిశగా ముందుకు వెళ్తున్న భారత్ లో, సోలార్ పవర్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. సాధ్యమైనంత వరకు పలు ప్రాంతాల్లో సోలార్ పవర్ ప్లాంట్ ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఇప్పటివరకు సాంప్రదాయ పద్ధతులు పాటిస్తుండగా, అవి ఖర్చు ఎక్కువగానూ, ఫలితం తక్కువగానూ ఉంటుంది. ఖర్చు తగ్గించి విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచేలా అనేక దేశాల పరిశోధకులు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మనదేశంలోని “ఐఐటీ – గుహాటీ”లో జరిపిన పలు పరిశోధనలు, సోలార్ పవర్ ఉత్పత్తిలో కీలకంగా మారనున్నాయి. సోలార్ పవర్ ఉత్పత్తికి సంబంధించి ముఖ్యమైన పరికరం “సోలార్ ప్యానల్”. సిలికాన్ ఆధారిత ఫోటో వోల్టాయిక్ సెల్ గా పిలువబడే సాంకేతికతను దశబ్దాలుగా సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నారు. అయితే ఈతరహా పరికరాలతో ఖర్చు ఎక్కువగానూ, ఉత్పత్తి తక్కువగాను ఉంటుంది. అంతేకాక, పరిమాణాన్ని బట్టి, ఈ సోలార్ ప్యానెళ్ల నిర్వహణ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రత్యామ్న్యాయాలు లేకపోవడంతో విద్యుత్ సంస్థలు ఏళ్లకేళ్లుగా ఈ ఫోటో వోల్టాయిక్ సెల్” నిర్మాణం కలిగిన ప్యానెళ్లనే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం “ఐఐటీ – గుహాటీ”లో జరిపిన పరిశోధనలు మున్ముందు సౌరశక్తిని మరింత అభివృద్ధి చేసే విధంగా ఉండనుంది. ప్రస్తుతం ఉన్న పీవీసీ స్థానంలో “పెరోవ్‌స్కైట్-నిర్మాణం” అనే సాంకేతికతను అమర్చి పరిశోధకులు పరీక్షలు జరిపారు. ఈ “పెరోవ్‌స్కైట్-నిర్మాణం” సూర్యరశ్మిని 21శాతం అదనంగా విద్యుత్ పరివర్తనం చేస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ఈ “పెరోవ్‌స్కైట్ సోలార్ సెల్ ” సాధారణంగా హైబ్రిడ్ ఆర్గానిక్-అకర్బన సీసం లేదా టిన్ హాలైడ్-ఆధారిత పదార్థాల సమ్మేళనంగా ఉంటుంది. దీంతో ఇది అధిక వేడిని, బాహ్య వాతావరణాన్ని తట్టుకోలేకపోతుంది. అయితే “పెరోవ్‌స్కైట్ సెల్” తయారీలో వాడిన పదార్ధాలు ఖర్చు తక్కువగాను, సామర్ధ్యం ఎక్కువగాను ఉందంటూ ఈ ప్రాజెక్ట్ కు నాయకత్వం వహించిన ఐఐటీ – గుహాటీ ప్రొఫెసర్ పరమేశ్వర్ ఐయ్యర్ పేర్కొన్నారు. వేడి, ఇతర వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా “పెరోవ్‌స్కైట్ సోలార్ సెల్ (”ను మరింత అభివృద్ధి చేస్తే ఎక్కువ మొత్తంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమేనని ప్రొఫెసర్ పరమేశ్వర్ పేర్కొన్నారు.

Post a Comment

0 Comments