Ad Code

ఆండ్రాయిడ్‌లో లోపం కనిపెట్టిన రోనీ దాస్‌


అస్సాంకు చెందిన రోనీ దాస్‌ ఆండ్రాయిడ్ లో బగ్ కనిపెట్టాడు. దీంతో అతను గూగుల్ నుంచి 5,000 డాలర్లు (దాదాపు రూ. 3.5 లక్షలు) అందుకున్నాడు. రోనీ దాస్ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు. ఈ బగ్ విషయాన్ని ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్‌కు తెలియజేశాడు. గూగుల్ ఆండ్రాయిడ్ భద్రతా బృందం నుంచి వచ్చిన ఇమెయిల్ ప్రకారం, దాస్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్ కోసం యాప్‌ను తయారుచేసే నేపధ్యంలో ఆండ్రాయిడ్ ఫోర్‌గ్రౌండ్ సేవల్లో లోపాలను కనుగొన్నాడు. బగ్ ఆండ్రాయిడ్ ఫోర్‌గ్రౌండ్ సర్వీసెస్‌ని ఉపయోగించడం.. యాప్ తయారు చేసేవారికి కావలసిన విధంగా అనుగుణంగా లేదని.. వాటిని ఉపయోగించడం ద్వారా ఈ లొసుగును గుర్తించే ప్రక్రియను దాటవేయవచ్చని అతను కనుగొన్నాడు. ఇది వినియోగదారుకు తెలియజేయకుండా లేదా ఎలాంటి సమాచారాన్ని పంపకుండానే కెమెరా, మైక్రోఫోన్.. లొకేషన్ వంటి ఫోన్ హార్డ్‌వేర్‌లను బ్యాక్‌గ్రౌండ్ నుండి యాక్సెస్ చేయగలిగింది. లోపాన్ని గూగుల్‌కు నివేదించిన తర్వాత దాస్ టెక్ దిగ్గజంతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. వారి సహాయంతో గూగుల్ దాన్ని పరిష్కరించగలిగింది. రోనీ దాస్‌ గౌహతీ గతంలో కూడా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించినట్లు తెలిపాడు. రోనీ దాస్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆండ్రాయిడ్‌లో తను కనుగొన్న బగ్‌ను సరిచేయడం వల్ల సైబర్‌ నేరగాళ్లు యూజర్‌ ప్రమేయం లేకుండా వారి సమాచారాన్ని సేకరించలేరని వెల్లడించాడు. అయితే, ఈ బగ్ ను గూగుల్ పరిష్కరించిందా లేదా అనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు.

Post a Comment

0 Comments

Close Menu