Ad Code

నకిలీలను డిలీట్‌ చేయండి ఇలా!


నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్లతో మోసాలు పెరిగిపోతున్నాయి. కొంత మంది సైబర్‌ నేరగాళ్లు మన పేరు మీదనే నకిలీ అకౌంట్‌ సృష్టించి మోసం చేస్తున్నారు. వాటి ద్వారా ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపుతున్నారు. వాళ్ల రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేయగానే అత్యవసరంగదా కొంత డబ్బు అవసరం ఉందని అడుగుతున్నారు. ఇది నిజమే అనుకుని చాలా మంది డబ్బులు పంపిస్తూ మోసపోతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. పోలీసులకు కూడా ఎన్నో ఫిర్యాదు కూడా అందాయి. దీంతో పోలీసులు కూడా అలాంటి ఖాతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే మీ పేరుపై నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను గుర్తించినప్పుడు పోలీసులకు తెలియకుండానే మనమే డిలీట్‌ చేసుకునే సదుపాయం ఉంది. మీ పేరుపై నకిలీ ఖాతా కాగా, మీకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉండి మిగతా ఖాతాలను డిలీట్‌ చేయాలని ముందుగా అకౌంట్‌ను ఓపెన్‌ చేయాలి. అకౌంట్‌ ఓపెన్‌ చేసిన తర్వాత ప్రొఫైల్‌ ఫోటో కింద కుడివైపు మూడు చుక్కల మీద క్లిక్‌ చేయండి, ఆ తర్వాత find support or report profile ఆప్షన్‌ను ఎంపిక చేసుకోండి, ఎందుకు రిపోర్ట్ చేస్తున్నామో కొన్ని కారణాలను తెరపై చూపిస్తుంది. వాటిలో ఫేక్‌ అకౌంట్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి రిపోర్టు ప్రక్రియను పూర్తి చేయాలి. మీరు మాత్రమే కాకుండా మీ మిత్రులు మరో 20 మందితో ఇదే విధంగా ఆ అకౌంట్‌పై రిపోర్టు చేయించాలి. అప్పుడు ఫేస్‌బుక్‌ దీనిని పరిశీలించి నకిలీ ఖాతాని డిలీట్‌ చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu