Ad Code

ఐఓఎస్​ డివైజ్‌లలోనూ గూగుల్​ ఫిట్


కరోనా తర్వాత ఆరోగ్యంపై ప్రతి ఒక్కరిలోనూ శ్రద్ధ పెరిగింది. ఎప్పటికప్పుడు మన గుండె, శ్వాసకోశ రేటును మానిటర్​ చేసుకునేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకే ఇటీవలి కాలంలో హెల్త్​ మానిటరింగ్​ డివైజెస్​కు గణనీయమైన ఆదరణ పెరిగింది. దీంతో సెర్చింజన్​ దిగ్గజం గూగుల్​ తన పిక్సెల్​ డివైజ్‌లో హృదయ స్పందన రేటుతో  పాటు శ్వాసకోశ రేటును  ట్రాక్​ చేసే ఫీచర్​ను విడుదల చేసింది. గూగుల్​ ఫిట్ ఫీచర్‌తో డివైజ్‌లోని కెమెరా సెన్సార్లను ఉపయోగించి హెల్త్ మానిటర్​ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ ఫీచర్​ ఇప్పటివరకు ఆండ్రాయిడ్​ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, ఇప్పుడు ఐఓఎస్​ డివైజెస్‌కు కూడా అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఐఓఎస్​లో రన్ అయ్యే డివైజెస్​తో కూడా ఇప్పుడు హార్ట్, రెస్పిరేటరీ రేటును చెక్​ చేసుకోవచ్చు. గూగుల్​ ఫిట్ హోమ్ ఫీడ్‌లో "Check your heart rate", "Track your respiratory rate" అనే రెండు ఆప్షన్లను కొత్తగా జోడించింది. స్మార్ట్​ఫోన్​లో యాక్టివ్​ ఇంటర్నెట్​ కనెక్షన్​ లేనప్పుడు కూడా ఈ ఫీచర్​ పని చేస్తుంది. వినియోగదారులు వారి డివైజ్​ వెనుక కెమెరా సెన్సార్​పై తమ బ్రొటన వేలు పెట్టి గట్టిగా ప్రెస్​ చేస్తే.. హృదయం ఎంత వేగంగా కొట్టుకుంటుందో తెలుసుకోవచ్చు. కేవలం 30 సెకన్లలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మీ ఫలితాలు డిస్‌ప్లే దిగువన పీబీఎం ప్రివ్యూ గ్రాఫ్‌ రూపంలో చూసుకోవచ్చు.ఈ టెస్టింగ్ పూర్తయిన తర్వాత గూగుల్​ ఫిట్​లో మీ హెల్త్​ మానిటరింగ్​ హిస్టరీని సేవ్ చేయాలా వద్దా అనేది కూడా ఎంచుకోవచ్చు. మరోవైపు, మీ ముందు కెమెరాతో మీరు ఒక నిమిషంలో తీసుకునే శ్వాసల సంఖ్యను కూడా ట్రాక్ చేయవచ్చు. అయితే, మీరు ఫోటో తీసుకునే సమయంలో మీ తల, ఎగువ మొండెం కదపకుండా స్పష్టంగా తీయండి. అప్పుడే కచ్చితత్వంతో కూడిన ఫలితం వస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu