Ad Code

నకిలీ పాన్‌కార్డును గుర్తించడం ఎలా?


పాన్‌కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఖచ్చితమైంది. బ్యాంక్ అకౌంట్ తీయాలన్నా పాన్‌కార్డు ఉండాల్సిందే. పాన్‌కార్డ్‌ల్లోనూ కొన్ని నకిలీ పాన్‌కార్డులు చలామణి అవుతున్నట్టు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. కొందరు నకిలీ పాన్‌కార్డులను తయారు చేసి వాటిని ఉపయోగించి పలు అక్రమాలకు పాల్పడుతున్నట్టు వెలుగులోకి రావడంతో నకిలీ పాన్‌కార్డును ఈజీగా గుర్తించే టెక్నాలజీని ఐటీ శాఖ డెవలప్ చేసింది. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన పర్మినెంట్ అకౌంట్ నెంబర్‌ కార్డు మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ద్వారా పాన్‌కార్డు అసలైనదో లేదో ఇట్టే కనిపెట్టేయొచ్చు. దానికోసం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఒక యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. స్మార్ట్‌ఫోన్ తీసుకొని గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి PAN QR Code Reader అనే యాప్‌ను ముందు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ ఇన్‌స్టాల్ అయ్యాక.. దాన్ని ఓపెన్ చేసి కెమెరా వ్యూఫైండర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు కెమెరా ఓపెన్ అవుతుంది. పాన్‌కార్డును తీసుకొని దానిమీద ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. స్కాన్ చేయడం పూర్తి కాగానే.. బీప్ అనే ఒక సౌండ్ వస్తుంది. పాన్ కార్డు యూజర్ వివరాలన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఆ స్క్రీన్ మీద ఉన్న వివరాలు.. పాన్ కార్డులో ఉన్న వివరాలు మ్యాచ్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. అవీ.. ఇవీ ఒకటే ఉంటే అది ఒరిజినల్ కార్డు అన్నమాట. వివరాలు మ్యాచ్ కాకపోతే అది నకిలీ పాన్ కార్డు అని అర్థం చేసుకోవాలి.

Post a Comment

0 Comments

Close Menu