Ad Code

రైల్వే కౌంటర్‌కు వెళ్లకుండా....!

IRCTC Tickets: రైల్వే టికెట్ల కోసం ఏజెంట్లపై ఆధారపడుతున్నారా?.. ఇకపై ఆ  అవసరం లేదు.. ఇలా చేయండి.. | Indian Railways Ticket booking Why Depends on  Agent for Railway Tickets Just Create IRCTC ... 

రైల్ టికెట్ కోసం కౌంటర్‌కు వెళ్లకుండా యూనివర్సల్ పాస్ ఉన్న రైల్వే ప్రయాణికులు అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ మొబైల్ యాప్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఇండియన్ రైల్వేస్ తెలిపింది. రైల్వే ప్రయాణికులు అన్‌రిజర్వ్‌డ్ టికెట్స్‌ని యాప్‌లో కొనేందుకు భారతీయ రైల్వే యూటీఎస్ మొబైల్ యాప్  రూపొందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అన్‌రిజర్వ్‌డ్ టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేయడానికి రైల్వే ప్రయాణికులు ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు యూనివర్సల్ పాస్ ఉన్నవారు కూడా యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్ ద్వారా రైలు టికెట్లు కొనే అవకాశం కల్పిస్తోంది. యూనివర్సల్ పాస్‌తో యూటీఎస్ యాప్‌లో టికెట్లు బుక్ చేసుకొనే విధానం : రైల్వే ప్రయాణికులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి యూటీఎస్ యాప్ డౌన్‌లోడ్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి లాగిన్ చేయాలి. మొదటిసారి ఈ యాప్ ఉపయోగిస్తున్నట్టైతే రిజిస్టర్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత ఐదు ఆప్షన్స్ కనిపిస్తాయి. నార్మల్ బుకింగ్, క్విక్ బుకింగ్, ప్లాట్‌ఫామ్ బుకింగ్, సీజన్ బుకింగ్, క్యూఆర్ బుకింగ్‌లో మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనుకుంటున్నారో స్టేషన్ వివరాలు ఎంటర్ చేయాలి. మీ యూనివర్సల్ పాస్‌ను యూటీఎస్ యాప్‌తో లింక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాలి. మీ RWALLET నుంచి ఛార్జీలు చెల్లించాలి. చివరగా పేమెంట్ పూర్తి చేసి టికెట్ కన్ఫామ్ చేయాలి.

Post a Comment

0 Comments

Close Menu