లాప్ టాప్ కీబోర్డులో బటన్స్ సరిగ్గా పనిచేయడం లేదా? ఎంత నొక్కినా 'కీ'లు సరిగ్గా ప్రెస్ కావడం లేదా? అలా అని హడావుడిగా మెకానిక్ దగ్గరికి పరుగెత్తాల్సిన అవసరం లేదు ఈ టిప్స్ ట్రై చేసి చూడండి. మీ లాప్ టాప్ కీబోర్డు బాగా పనిచేస్తుంది. ముందు లాప్ టాప్, పీసీని రీబూట్ చేయండి. ఇప్పుడొసారి ట్రై చేసి చూడండి. కీబోర్డు సరిగ్గా పనిచేస్తే ఓకే.. లేకపోతే మరోసారి చేయండి. ఏదైనా సాఫ్ట్ వేర్ సమస్య ఉంటే రీ బూట్ లో తెలిసిపోతుంది. మామూలుగా లాప్ టాప్ తో పనిచేసే వారు ఒళ్లో లాపీ పెట్టుకొని ఏదో ఒకటి తినుకుంటూ పనిచేస్తారు. ఆ సమయంలో ఏదైనా ఫుడ్ చిన్న చిన్న ముక్కలు కీబోర్డులో పడిపోతే కూడా కీబోర్డు సరిగ్గా పనిచేయదు. సో.. టూత్ పిక్ తో ఓ సారి కీబోర్డును క్లీన్ చేయండి. కంప్రెస్డ్ ఎయిర్ తో కూడా కీబోర్డు క్లీన్ చేయొచ్చు. ఒక్కోసారి కీబోర్డు సెట్టింగ్స్ మారిపోయినా కీబోర్డు సరిగ్గా పనిచేయదు. దీన్ని రిసాల్వ్ చేయాలంటే స్టార్ట్ మెనూ ఓపెన్ చేసి అందులో కీబోర్డు సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. కంట్రోల్ ప్యానెల్ అని టైప్ చేసి విండోలో కీబోర్డ్ కోసం సెర్చ్ చేయండి. ఇప్పుడు మీకు కావాల్సిన కీబోర్డును సెట్ చేసుకోండి. మనిషైనా, గాడ్జెట్ అయినా ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే.. ముందుకు సాగడం జరగదు. అందుకే.. మీ కీబోర్డ్ డ్రైవర్ ని అప్డేట్ చేయండి. స్టార్ట్ మెనూలో డివైజ్ మేనేజర్ అని టైప్ చేయండి. కీబోర్డ్స్ వచ్చే వరకు సెర్చ్ చేయాలి. కీబోర్డులు వచ్చాక రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లోకి వెళ్లాలి. అప్డేట్ డ్రైవర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కొద్దిసేపు ఆగితే.. న్యూ డ్రైవర్ వస్తుంది. దాన్ని ఇన్ స్టాల్ చేయండి. లాప్ టాప్ కీబోర్డు డ్రైవర్‌ను అన్‌ ఇన్ స్టాల్‌ చేయడం వల్ల కూడా కీబోర్డు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. దీనికి కూడా కీబోర్డ్‌ అప్డేట్‌ మాదిరిగానే అన్‌ ఇన్‌స్టాల్‌ కోసం స్టెప్స్‌ ఫాలో కావాలి. డివైస్‌ మేనేజర్‌లో కీబోర్డ్‌ డ్రైవర్‌ను సెలక్ట్ చేసుకొని పసుపురంగులో ఎక్స్‌క్లమేషన్‌ వార్నింగ్‌ వచ్చిందంటే డ్రైవర్ ప్రాబ్లమ్ ఉన్నట్టు. వెంటనే దాన్ని అన్ ఇన్ స్టాల్ చేసేయండి. కొత్త డ్రైవర్ ఇన్ స్టాల్ చేసుకోండి.