Ad Code

అధునాతన హ్యూమనాయిడ్ రోబో ఈమెకా


ప్రపంచంలోనే అత్యంత అధునాతన హ్యూమనాయిడ్ రోబోను బ్రిటన్ లో ప్రవేశపెట్టారు. దీనికి ‘ఈమెకా’ అని పేరు పెట్టారు. దీనిని బ్రిటిష్ కంపెనీ ఇంజినీర్డ్ ఆర్ట్స్ తయారు చేసింది. ఈ రోబోలో అత్యంత విశేషమేమిటంటే, దీని ముఖకవళికలు మనుషుల్లాగే ఉంటాయి. ఈ రోబోను సిద్ధం చేయడానికి ఎంత ఖర్చయిందనే దానిపై కంపెనీ ఎలాంటి అధికారిక సమాచారాన్ని విడుదల చేయలేదు. ఈ హ్యూమనాయిడ్ రోబో అనేక విధాలుగా మనుషులను పోలి ఉంటుందని, అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతన హ్యూమనాయిడ్ రోబోగా పేరు పొందిందని కంపెనీ పేర్కొంది. కంపెనీ తన వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేయడం ద్వారా ఎబెకాను పరిచయం చేసింది. యూట్యూబ్ యూజర్లు, ఇది చాలా వాస్తవమైనది.. మనుషులలా కనిపించే గొప్ప యంత్రం అని అంటున్నారు. మనిషిలా కనిపించే కృత్రిమ శరీరంతో ఈమెకాను తయారు చేసినట్లు దీన్ని తయారు చేసిన ఇంజినీర్డ్ ఆర్ట్స్ సంస్థ తెలిపింది. ఇందులో సోఫియా రోబోలో ఉపయోగించిన టెక్నాలజీని చాలా వరకు ఉపయోగించారు. సోఫియా రోబోట్ 2016 లో ప్రవేశపెట్టబడింది, దీనిని సూపర్ ఇంటెలిజెంట్ రోబోట్ అని కూడా పిలుస్తారు.

Post a Comment

0 Comments

Close Menu