Ad Code

తక్కువ ధరలో లభించే ఎల్​ఈడీ బల్బులు


స్మార్ట్ హోమ్‌లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉత్పత్తులు ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. చాలా మంది తమ ఇళ్లలో స్మార్ట్ ఉత్పత్తులు వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే వాయిస్ కమాండ్‌తో మానిటరింగ్ చేయగల స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ లైట్లకు డిమాండ్​ పెరుగుతోంది. అయితే మార్కెట్​లో అనేక స్మార్ట్​ ఉత్పత్తులు ఉండటంతో వేటిని కొనాలనే దానిపై చాలా మంది కన్​ఫ్యూజ్​ అవుతుంటారు. 

విప్రో E27 9 వాట్స్​ వైఫై స్మార్ట్ ఎల్​ఈడీ బల్బ్: 9 వాట్ల విప్రో స్మార్ట్ ఎల్​ఈడీ బల్బ్ అమెజాన్​లో రూ. 656 ధర వద్ద లభిస్తుంది. ఇది 16 మిలియన్ కలర్లతో వస్తుంది. అమెజాన్​ అలెక్సా, గూగుల్​ అసిస్టెంట్​ వంటి వర్చువల్ అసిస్టెంట్‌లకు మద్దతిస్తుంది. ఈ స్మార్ట్ బల్బ్​ను మొబైల్​ యాప్ ద్వారా మానిటర్​ చేయవచ్చు. అమెజాన్​ అలెక్సా లేదా గూగుల్​ అసిస్టెంట్​ ద్వారా వాయిస్‌ కంట్రోల్​ చేయవచ్చు.

ఫిలిప్స్​ స్మార్ట్​ వైఫై ఎల్​ఈడీ బీ22 బల్బ్: ఫిలిప్స్ స్మార్ట్ బల్బ్ విజయ్ సేల్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 10W స్మార్ట్ బల్బ్ మొబైల్ యాప్ కంట్రోల్​తో వస్తుంది. ఇది 16 మిలియన్ కలర్స్​ను వెదజల్లుతుంది. ఈ స్మార్ట్​ ఎల్​ఈడీ బల్బు వాయిస్ కంట్రోల్​కు మద్దతిస్తుంది.

రియల్​మీ స్మార్ట్​ వైఫై ఎల్ఈడీ బల్బ్​ (9 వాట్స్​) బీ22: 9 వాట్స్​ రియల్​మీ స్మార్ట్ బల్బ్ 25,000 గంటల రేట్ లైఫ్‌ను కలిగి ఉంటుంది. ఇది 16 మిలియన్ రంగులతో వస్తుంది. అమెజాన్​ అలెక్సా, గూగుల్​ అసిస్టెంట్​ను ఉపయోగించి వాయిస్ కంట్రోల్‌ కూడా చేయవచ్చు. అమెజాన్​లో ఇది కేవలం రూ. 799 ధర వద్ద లభిస్తుంది.

సిస్కా బీ22 ఎల్​ఈడీ స్మార్ట్ బల్బ్ : 7వాట్స్​ సిస్కా స్మార్ట్ బల్బ్ అమెజాన్​లో రూ. 720 ధర వద్ద అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది అమెజాన్ అలెక్సాకు మద్దతిస్తుంది. ఈ బల్బ్ 16 మిలియన్ కలర్ ఆప్షన్‌లతో వస్తుంది. వైఫైకి మద్దతిస్తుంది. ఇది AC 220-240V ఇన్‌పుట్ వోల్టేజ్​కు మద్దతిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu