Ad Code

అగ్ని-పి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం


ఒడిశాలోని బాలాసోర్ వద్ద డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ తీరంనుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. తూర్పుతీరంలో ఏర్పాటు చేసిన పలు టెలీమెట్రీ, రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ స్టేషన్లు, నౌకల్లో అమర్చిన పరికరాలు క్షిపణి మార్గాన్ని ట్రాక్ చేస్తూ దాని పనితీరును పర్యవేక్షించాయి. నిర్దేశించిన ప్రమాణాలను అత్యంత కచ్చితత్వంతో క్షిపణి చేరుకుందని డీఆర్డీవో ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 28న అగ్ని-పి క్షిపణిని తొలిసారిగా డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. అణు వార్ హెడ్లను మోసుకుపోయే సామర్థ్యం కలిగిన నవతరం క్షిపణి ఇది. 1000 నుంచి 2000 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించే శక్తి దీని సొంతం. రెండు దశలు కలిగిన అగ్ని- పి క్షిపణి.. కచ్చితత్వంతో కూడిన నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థతో పాటు ఘన ప్రపోల్లెంట్‌తో కూడిన ప్రయోగ వేదికల నుంచి దీనిని ప్రయోగించవచ్చు. అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో కూడిన ఈ రెండో ప్రయోగంలో అగ్ని-పి అద్భుతంగా శాస్త్రవేత్తల అంచనాల మేరకు సామర్థ్యాన్ని చాటింది. అగ్ని సిరీస్ బాలిస్టిక్ క్షిపణుల్లో తాజా క్షిపణి అత్యంత తేలికైనది, పరిమాణంలో అతి చిన్నది. అగ్ని-పి బరువు అగ్ని3 క్షిపణి బరువులో కేవలం 50 శాతమే ఉంటుంది. అగ్ని-పి రెండు దశల క్షిపణి వ్యవస్థను కొత్త ప్రొపల్షన్ వ్యవస్థలను అమరుస్తూ అభివృద్ధి చేశారు. ఇది రాకెట్ మోటార్ తో పాటు అడ్వాన్స్ డ్ నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలతో ముందుకు సాగుతుంది. ఈ క్షిపణిని రైలు, రోడ్డు పై నుంచి కూడా వాహనాల నుంచి ప్రయోగించే సౌలభ్యం కలిగివుంది. ఇవి కానిస్టెరైజ్డ్ క్షిపణి అంటే కంటైనర్ బేస్డ్ లాంచింగ్ వ్యవస్థ కలిగివుంది. దీంతో అగ్ని-పి క్షిపణులను లాంచ్ చేయడానికి సమయం తక్కువ పడుతుంది. ఈ క్షిపణులను స్టోర్ చేయడానికి రవాణాచేయడం తేలిక.

Post a Comment

0 Comments

Close Menu