Ad Code

భాష ఏదైనా జవాబు ఇవ్వవచ్చు !



మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ 2021 ముగుస్తున్న తరుణంలో కొత్త ఫీచర్‌ను తీసుకోచ్చింది. యాప్‌లోని మెసేజ్‌లను ట్రాన్స్‌లేట్ చేయడం, వచ్చిన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడానికి ఎమోజీలను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు చదవలేని భాషలలో పంపిన సందేశాల కోసం అనువాదం ఆప్షన్‌ను అందుబాటులోకి తేవడం విశేషం. మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడానికి వ్యక్తిగత చాట్‌లో ఎమోజీలు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాయి. గ్రూప్‌లు, ఛానెల్‌లలో, అడ్మిన్‌లు రియాక్షన్‌లను ఆన్ చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు. టెలిగ్రామ్ చాట్‌లను మరింత సులభంగా చేయడానికి వాట్సాప్, సిగ్నల్ వంటి వాటితో పోటీ పడేందుకు దాని యాప్‌లో స్పాయిలర్ టెక్స్ట్ ఫార్మాటింగ్‌ను తెచ్చింది. వినియోగదారులు తమ సందేశాలలోని నిర్దిష్ట వివరాలు దాచడానికి ఇది ఉపయోగపడుతుంది. టెలిగ్రామ్‌కు సపొర్ట్ ఇచ్చే అన్ని ఆండ్రాయిడ్ పరికరాలలో అనువాద ఫీచర్ అందుబాటులో ఉంది. కానీ iOS వినియోగదారులు ఈ సేవను ఉపయోగించుకోవాలంటే iOS 15కి అప్‌డేట్ అవ్వాలి. టెలిగ్రామ్ ఇప్పటికే QR కోడ్‌లకు సపోర్ట్ ఇస్తుంది. కొత్త ఫీచర్ ద్వారా పబ్లిక్ యూజర్‌నేమ్ ఉన్న ఏ యూజర్ కోసం అయినా రూపొందించబడే QR కోడ్‌కు సపోర్ట్‌గా వస్తుంది. విభిన్న రంగులతో QR కోడ్‌ను గ్రూప్‌లు, చానెల్‌ల కోసం రూపొందించవచ్చు. వీటిని ఇతర యాప్‌లతో షేర్ చేయవచ్చు లేదా ప్రింట్ చేసి ఇమెయిల్ చేయవచ్చు.


Post a Comment

0 Comments

Close Menu