Ad Code

ఆధార్ కార్డు మొబైల్ నెంబర్‌తో లింక్ ?


ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకంలో లబ్ధి పొందాలన్నా ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. చివరకు రేషన్ బియ్యం తీసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ చెబితేనే రేషన్ బియ్యం ఇస్తారు. లేదంటే రేషన్ బియ్యం కూడా రావు. మన జీవితంలో ఆధార్ కార్డు ఇప్పుడు చాలా ప్రధానమైనది. ఆధార్ కార్డు లేకుంటే చివరకు ఒక సిమ్ కార్డు కూడా తీసుకోలేం. ఆధార్ కార్డుతో ఖచ్చితంగా మొబైల్ నెంబర్‌ను కూడా లింక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. పలు పథకాలకు అర్హులు కారు. ఈపీఎఫ్ దగ్గర్నుంచి.. ప్రభుత్వం కార్యాలయాల్లో తీసుకునే ప్రతి డాక్యుమెంట్ కోసం ఆధార్ కార్డును మొబైల్ నెంబర్‌కు లింక్ చేసుకోవాల్సిందే. చాలామందికి తమ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్‌తో లింక్ అయిందో లేదో తెలియదు. అలాగే.. ఆధార్ రిజిస్ట్రేషన్ సమయంలో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో కూడా కొందరికి తెలియదు. అటువంటి వాళ్లు ఆన్‌లైన్‌లో తమ ఆధార్ కార్డు.. మొబైల్ నెంబర్‌కు లింక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. లింక్ అయితే ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో కూడా తెలుసుకోవచ్చు. దాని కోసం ముందుగా ఆధార్ అఫిషియల్ వెబ్‌సైట్ https://uidai.gov.in/ కు వెళ్లి పైన మెనూలో ఉన్న మై ఆధార్( MyAadhaar) సెక్షన్‌లోకి వెళ్లండి. కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో verify my email/ mobile number అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేయగానే వేరే పేజి ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీ, క్యాప్చా డిటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ అప్పటికే మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే.. మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఈ ఆధార్‌తో లింక్ అయి ఉంది.. అనే మెసేజ్ వస్తుంది. ఒకవేళ మొబైల్ నెంబర్ మ్యాచ్ కాకపోతే.. వెంటనే దగ్గర్లోకి ఆధార్ సెంటర్‌కు వెళ్లి మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu