Ad Code

దూసుకొస్తున్న ఐదు గ్రహ శకలాలు

 


డిసెంబర్ లో భూమికి ప్రమాదం పొంచి ఉంది. ఐదు గ్రహ శకలాలు భూమి వైపు దూసుకొస్తున్నాయి. ఎప్పుడూ జరగని ఉత్పతాలు ఈ నెలలో జరుగబోతున్నాయంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్ (నాసా) చెప్తున్న ప్రకారం ఈ నెలలో ఐదు రోజుల్లో ఐదు గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టనున్నాయి. వీటిలో ఒకటి చాలా పెద్దది. మిగతా మూడు ప్రమాదకరమైన గ్రహశకలాలు. వీటి వల్ల ఎప్పటికైనా భూమికి ప్రమాదమే. పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే పెద్ద సైజులో ఉన్న నెరూస్ గ్రహశకలం భూమివైపు చాలా వేగంగా దూసుకొస్తుంది. దీని పొడవు 330 మీటర్లు. డిసెంబర్ 11న ఇది భూమికి అతి దగ్గరగా రానుంది. సెకన్ కి 6.58 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. భూమి వైపు వేగంగా వస్తున్న ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు తక్కువేనట. ఇది భూమికి 39 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందుకనే భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉండదు. ఒకవేళ కక్ష్య మార్చుకుంటే భూమి మీద పడే ఛాన్స్ ఉంది. మళ్లీ ఈ గ్రహశకలం 2060 సంవత్సరం ఫిబ్రవరి 14న భూమికి దగ్గరగా వస్తుంది. అప్పుడు మాత్రం 11 లక్షల కిలోమీటర్ల దూరంలో ఆగిపోతుందట!. మొదటి గ్రహ శకలం కంటే ఇది మరింత పెద్దది. దీనికి 2003 SD220 అని పేరు పెట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. ప్రపంచంలోనే ఎత్తైన భవనమైన బుర్జ్ ఖలీఫా అంత సైజులో ఈ గ్రహ శకలం ఉంటుంది. దీని వ్యాసార్ధం 769 నుంచి 816 మీటర్ల వరకు ఉంటుందని అంచనా. డిసెంబర్ 17న ఈ గ్రహ శకలం భూమికి దగ్గరగా వస్తుంది. భూమికి 54 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఈ గ్రహశకలం ప్రయాణించనుంది. ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని అత్యంత ప్రమాదకర గ్రహశకలంగా భావిస్తున్నారు. సరిగ్గా క్రిస్మస్‌కి ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 24న భూమికి దగ్గరగా రాబోతున్న గ్రహశకలం 2016 TR54. ఇది 100 నుంచి 230 మీటర్ల సైజులో ఉంటుంది. భూమి దూసుకొస్తున్న ఈ శకలం భూమికి 64 లక్షల కిలోమీటర్ల దూరంలో ఆగిపోతుందట. అయితే.. కక్ష్య మార్చుకున్నా.. వేగం పెరిగినా భూమి పడే అవకాశం ఉందంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. దీన్ని కూడా ప్రమాదకర గ్రహ శకలాల జాబితాలో చేర్చారు ఖగోళ వేత్తలు. ఇది కూడా పెద్ద గ్రహశకలమే దీని పేరు 2018 AH. ఈ గ్రహశకలం తాజ్ మహల్ కంటే పెద్దసైజులో ఉంటుంది. దీని వ్యాసార్థం 84 నుంచి 190 మీటర్లు. ఇది డిసెంబర్ 27న భూమికి అతి దగ్గరగా వస్తుంది. భూమి నుంచి 89 లక్షల కిలోమీటర్ల దూరంలో ఈ గ్రహ శకలం ఆగిపోతుంది. కాబట్టి.. భూమిని ఢీకొట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు ఖగోళవేత్తలు. దీని పేరు 2017 AE3. 120 నుంచి 260 మీటర్ల సైజులో ఉంటుందీ గ్రహశకలం. ఈ నెలలో భూమివైపు వచ్చే దూసుకొస్తున్న గ్రహశకలాల్లో ఇది మూడో అతి పెద్ద ఆస్టరాయిడ్. ఇది డిసెంబర్ 29న భూమికి దగ్గరగా వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది భూమికి 31 లక్షల కిలోమీటర్ల దూరంలో ఆగిపోనుంది. భూమిని ఢీకొట్టే ఛాన్సులు తక్కువే ఉన్నాయట.

Post a Comment

0 Comments

Close Menu