2021కి వీడ్కోలు చెప్పడానికి ప్రపంచమంతా సిద్ధమవుతోంది. తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటూ న్యూఇయర్ విషెస్ చెప్పుకుంటుంటారు. ఇలా రకరకాల మెసేజ్‌లను తమ శ్రేయోభిలాషులకు, స్నేహితులకు పంపిస్తూ కొత్తేడాదికి ఆహ్వానం పలుకుతుంటారు.మారుతోన్న కాలానికి అనుగుణంగా విషెస్‌ను కూడా కొత్తగా చెబితే చాలా బాగుటుంది కదూ.. మీలాంటి వారి కోసమే ప్రముఖ మెసేసింగ్ యాప్ వాట్సాప్ స్టిక్కర్ల రూపంలో విషెస్ చెప్పే అవకాశాన్ని తీసుకొచ్చింది. 2022 ఏడాదికి గాను తాజాగా కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇంతకీ ఈ స్టిక్కర్స్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి.? ఇందుకోసం ముందుగా ప్లేస్టోర్‌లో స్టిక్కర్ ప్యాక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్లేస్టోర్‌లోకి వెళ్లి న్యూఇయర్ స్టిక్కర్స్ అని సెర్చ్ చేయాలి. అనంతరం వచ్చిన వాటిలో ఒక స్టిక్కర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. స్టిక్కర్స్ ప్యాక్‌ను మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి. తర్వాత మీరు ఎవరికైతే మెసేజ్ పంపించాలనుకుంటున్నారో వారి చాట్ బాక్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎమోజీ బట్‌పై క్లిక్ చేయాలి. అనంతరం కుడివైపు ఉండే స్టిక్కర్స్ ట్యాబ్‌లోకి వెళ్లాలి. అప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న స్టిక్కర్ అక్కడ కనిపిస్తాయి. మీకు నచ్చిన స్టిక్కర్‌ను సెలక్ట్ చేసుకొని సెండ్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ ఆప్షన్ ఐఫోన్ యూజర్లకు మాత్రం అందుబాటులో లేదు. ఐ స్టోర్‌లో ఇలాంటి స్టిక్కర్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలు లేదు. వీరు ఇతర థార్డ్ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆండ్రాయిడ్ యూజర్ల నుంచి స్టిక్కర్లను పంపించుకొని వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసుకునే అవకాశం మాత్రం ఉంది.
0 Comments