స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ దిగ్గజం యాపిల్ భారతదేశంలో కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈ సంస్థ తాజాగా మన దేశంలో ఐఫోన్ 13 ట్రయల్ ప్రొడక్షన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 'ది ఎకనామిక్ టైమ్స్' వార్తాసంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న అన్ని స్మార్ట్ ఫోన్‌లను స్థానికంగానే తయారు చేయడానికి యాపిల్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ చెన్నై సమీపంలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ట్రయల్ ప్రొడక్షన్ ప్రారంభించింది. ఫిబ్రవరి నాటికి దేశీయ మార్కెట్ అవసరాలతో పాటు ఎగుమతుల కోసం భారతదేశంలోనే ఐఫోన్ 13 కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించాలని యాపిల్ భావిస్తోందని సంస్థ ప్రతినిధులు చెప్పినట్లు కథనంలో వెల్లడించింది. యాపిల్ సెమీకండక్టర్ చిప్‌ల సప్లైని కూడా పొందిందని. భారతదేశంలో ప్రొడక్ట్స్‌ను తయారు చేయాలనే కంపెనీ విస్తరణ ప్రణాళికకు ఇది సహాయపడిందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది. భారతదేశంలో ఐఫోన్ 13 ఉత్పత్తి.. గ్లోబల్ మార్కెట్లలో ఈ డివైజ్‌ల సరఫరాను మెరుగుపరచడంలో యాపిల్‌కి సహాయపడుతుంది. భారతదేశంలో ఉత్పత్తి చేయనున్న డివైజ్‌లలో 20-30 శాతం ప్రొడక్ట్స్‌ను ఎగుమతి చేస్తామని సంస్థ ప్రతినిధులు ETకి చెప్పారు. అయితే ఈ విషయంపై యాపిల్, ఫాక్స్‌కాన్ సంస్థలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.
యాపిల్ ఫోన్‌పై మేడ్ ఇన్ ఇండియా ముద్ర
0
December 21, 2021
Tags