Ad Code

మీ పేరు మీద ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉన్నాయా?


సిమ్ కార్డ్స్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేస్తుండటం వలన ఎన్ని పడితే అన్ని సిమ్ కార్డ్స్ తీసుకునే చాన్స్ ఇప్పుడు లేదు. కొత్త సిమ్ కార్డు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందే. ఆధార్ నెంబర్ లేకుంటే సిమ్ కార్డు ఇవ్వరు. ఒక ఆధార్ నెంబర్ మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో కూడా ఇట్టే ట్రాక్ చేసే టెక్నాలజీ ఇప్పుడు ఉంది. ఎక్కువ సిమ్ కార్డ్స్ తీసుకున్నవాళ్లు మాత్రం ఉపయోగంలో లేని సిమ్‌కార్డ్స్‌ను వెంటనే డిస్‌కనెక్ట్ చేసుకోవాల్సిందే. లేకపోతే ఉపయోగంలో ఉన్న సిమ్‌కార్డ్స్ కూడా బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఒక ఆధార్ నెంబర్ మీద 9 సిమ్ కార్డ్స్‌ను మాత్రమే ఇస్తారు. 9 సిమ్‌కార్డ్స్ దాటితే అందులో ఉపయోగంలో ఉన్నవాటిని వెంటనే రీవెరిఫై చేసుకోవాలి. రీవెరిఫై చేసుకున్న నెంబర్లను కాకుండా మిగతా నెంబర్లు అన్నీ డియాక్టివేట్ అవుతాయి. జమ్ముకశ్మీర్‌, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో మాత్రం కేవలం ఒక ఆధార్ నెంబర్ మీద 6 సిమ్స్ మాత్రమే తీసుకోగలరు. మిగతా రాష్ట్రాల్లో 9 వరకు సిమ్స్ తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న సిమ్ కార్డ్స్ డేటాను అనలైజ్ చేస్తుండగా.. ఒక సబ్‌స్క్రైబర్ 9 కంటే ఎక్కువ సిమ్ కార్డ్స్ తీసుకున్నట్టు తేలిందని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్(డీవోటీ) తెలిపింది. దీంతో 9 కంటే ఎక్కువ సిమ్‌కార్డ్స్ కలిగి ఉన్న సబ్‌స్క్రైబర్ అన్ని నెంబర్స్‌ను రీవెరిఫై చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ ఇచ్చిన సమయం లోపట సబ్‌స్క్రైబర్ రీవెరిఫై చేసుకోకపోతే.. ఆ మొబైల్ నెంబర్స్‌ను డీవోటీ ఫ్లాగ్ చేస్తుంది. ఆయా నెంబర్స్‌ను వెంటనే బ్లాక్ చేయాలని టెలికాం ఆపరేటర్లకు డీవోటీ ఆదేశాలు జారీ చేసింది. సబ్‌స్క్రైబర్ ఏదైనా మొబైల్ నెంబర్‌ను డిస్‌కనెక్ట్ చేయాలనుకుంటే.. రూల్ ప్రకారం ఫ్లాగ్ అయిన మొబైల్ కనెక్షన్స్ అవుట్ గోయింగ్ ఫెసిలిటీని 30 రోజుల్లో తీసేస్తారు. ఆ తర్వాత మరో 15 రోజుల్లో ఇన్‌కమింగ్ కాల్స్ సదుపాయం కూడా పోతుంది.

 సబ్‌స్క్రైబర్ రీవెరిఫికేషన్ చేసుకోకపోతే.. 60 రోజుల్లో ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆ నెంబర్‌ను టెలికాం సంస్థ బ్లాక్ చేసేస్తుంది. ఒకవేళ ఏ సబ్‌స్క్రైబర్ అయినా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉంటే.. ఆసుపత్రిలో ఉంటే.. విదేశాల్లో ఉంటే మాత్రం వాళ్లకు మరో 30 రోజుల గడువును పొడిగిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu