Ad Code

ల్యాండ్‌లైన్ ఫోన్‌లో వాట్సప్, యూబ్యూబ్, గేమ్స్...!


స్మార్ట్ ల్యాండ్‌లైన్ ఫోన్ పేరు.. KT5(3C). వాస్తవానికి ఇది టాబ్లెట్. కానీ ల్యాండ్‌లైన్ ఫోన్ లుక్ వచ్చేలా రివీవర్ కూడా పొందుపరిచారు. ఇందులో పెద్ద ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. అన్ని రకాల యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీడియోలు చూడొచ్చు. గేమ్స్ ఆడొచ్చు. అంటే మన మొబైల్ ఫోన్‌లో ఉండే అన్ని సదుపాయాలూ అందులో ఉంటాయి. నికీ టోంస్కీ అనే ట్విటర్ యూజర్ ఈ ఫోన్ ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. కొత్త రకం ల్యాండ్‌ఫోన్‌ను రూపొందిస్తున్నామని దాని లుక్‌తో పాటు స్పెసిఫికేషన్ వివరాలను పంచుకున్నాడు. KT5(3C) టాబ్లెట్‌ ఆండ్రాయిడ్ 10.0 ఆపరేటింగ్ సిస్టమ్, ఎల్టీఈ నెట్వర్క్‌తో పనిచేస్తుంది. సాధారణ మొబైల్ ఫోన్‌లాగే ఇందులో సిమ్ కార్డు వేసుకోవాలి. వాట్సప్, యూట్యూబ్‌తో పాటు అన్నీ యాప్స్‌ వాడుకునే సదుపాయం ఉంది. ఇంట్లో ఎక్కడైనా దీన్ని పెట్టుకోవచ్చు. ఒక రూమ్ నుంచి మరొక రూమ్‌కు ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఎవరైనా కాల్ చేస్తే రిసీవర్ ఎత్తైన మాట్లాడవచ్చు. లేదంటే డిజిటల్ స్క్రీన్‌పై స్కైప్ చేసైనా కాల్ లిఫ్ట్ చేయవచ్చు.ఈ ఫోన్‌లో 2500 ఎంఏహెచ్ రీచార్జబుట్,రిమువబుల్ బ్యాటరీ ఉంటుంది. స్టాండ్‌బై మోడ్‌లో 140 గంటల వరకు చార్జింగ్ వస్తుంది. ఒకవేళ బ్యాటరీ డెడ్ అయినప్పటికీ..పవర్ సప్లైకి కనెన్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. మొదట ఈ ఫోన్ ఫొటోలు చూసిన నెటిజన్లు ఫేక్ ఫొటోగా కొట్టిపారేశారు. కానీ ఇది నిజం. అచ్చం ల్యాండ్‌ఫోన్‌లా కనిపిస్తున్న ఆ టాబ్లెట్.. చైనా ఈకామర్స్ అలీ బాబాలో అందుబాటులో ఉన్నాయి. దీని ధర 115-140 డాలర్లుగా పేర్కొన్నారు. అంటే మన కరెన్సీలో రూ.8500 నుంచి 10,500.

Post a Comment

0 Comments

Close Menu