Ad Code

వాట్సప్‌లో బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోండి!


బ్యాంకింగ్ యాప్ వాడుతున్నవారు యాప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చూడాలి. సింపుల్‌గా బ్యాలెన్స్ చెక్ చేయడానికి వాట్సప్ చాలు. వాట్సప్‌లోనే బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్  చెక్ చేయొచ్చు. అయితే ఇందుకోసం మీరు వాట్సప్ పే సర్వీస్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సప్ పే రిజిస్టర్ చేస్తే మీ యూపీఐ అకౌంట్ వాట్సప్‌లో యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత కేవలం కొన్ని సెకండ్లలో కొన్ని క్లిక్స్‌తో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. వాట్సప్ పే సర్వీస్ ఇండియాలో 2018లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులతో కలిసి ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ పే, ఫోన్‌పే లాగానే వాట్సప్ కూడా యూపీఐ సర్వీసెస్ అందిస్తోంది. అయితే వాట్సప్ ఛాటింగ్ యాప్‌లోనే యూపీఐ సేవల్ని పొందొచ్చు. వాట్సప్‌లో రెండు పద్ధతుల్లో బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.  మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ యాప్ ఓపెన్ చేసి, టాప్ రైట్ కార్నర్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి,  పేమెంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసి  View Account Balance ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయండి. ఆపై స్క్రీన్ పైన మీ అకౌంట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఇంకో పద్దతి : వాట్సప్ యాప్‌లో పేమెంట్ నోటిఫికేషన్ స్క్రీన్‌లో పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత View Account Balance ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వేర్వేరు అకౌంట్స్ వాట్సప్ పేలో రిజిస్టర్ చేసినట్టైతే ఏ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ అకౌంట్ సెలెక్ట్ చేయండి. యూపీఐ పిన్ ఎంటర్ చేయండి. స్క్రీన్ పైన మీ అకౌంట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. వాట్సప్ ద్వారా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకునే పద్ధతి గూగుల్ పే, ఫోన్‌పే, ఇతర యాప్స్‌లో ఉన్నట్టుగానే ఉంటుంది. దాదాపు పైన చెప్పిన స్టెప్స్ ఫాలో అయి ఇతర యూపీఐ యాప్స్‌లో కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అయితే వాట్సప్ ప్రతీ రోజూ ఉపయోగిస్తుంటారు కాబట్టి ఇతర యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu