Ad Code

వాట్సాప్ నెంబర్ మార్చాలా... ?


స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి లేడు దాంతో వాట్సాప్ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఎలాంటి సందేశం పంపాలన్నా వాట్సాప్ మొదటి ఆప్షన్ గా మారింది. దానికి తగినట్లే వాట్సాప్ సంస్థ కూడా తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు వినూత్న ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెంచుకుంటూ పోతుంది. వాట్సప్ వాడుతున్న వినియోగదారులకు తెలియని ఎన్నో ఫీచర్లు వాట్సాప్ లో దాగి ఉన్నాయి.  ఇలాంటి వాటిలో చేంజ్ నెంబర్ అనేది  ఒకటి. వాట్సాప్ లో అందుబాటులో ఉన్న ఇక ఈ ఫీచర్ ను ఉపయోగించుకొని తమ ప్రైమరీ నెంబర్ ను వేరొక నెంబర్ వాట్సప్ అకౌంట్ కూడా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫీచర్ సహాయంతో వాట్సాప్ అకౌంట్ నెంబర్ మార్చడం వల్ల చాట్స్ కూడా డిలీట్ కావు. కానీ ఇక వాట్సప్ అకౌంట్ నెంబర్ మార్చే సమయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా మీరు మార్చాలనుకుంటున్న నెంబర్ వర్కింగ్ లో ఉందో లేదో తెలుసుకోవాలి ఎందుకంటే. ఆ నెంబర్ కు కాల్స్ మెసేజ్ లు లాంటివి వస్తేనే నెంబర్ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ కొత్త మొబైల్ కు వాట్సాప్ మార్చాలి అనుకుంటే ఈ ఫీచర్ వర్క్ చెయ్యదు అని గుర్తుంచుకోవాలి. ముందుగా మీ మొబైల్ లో వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. చేంజ్ నంబర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి తర్వాత నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మీ పాత వాట్సాప్ నంబర్, మార్చాలి అనుకుంటున్నా కొత్త వాట్సాప్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ వాట్సాప్ అకౌంట్‌ను మారుతున్నట్లు మీ కాంటాక్ట్స్‌కు తెలియ చెయ్యాలా వద్దా అని అడుగుతుంది . అప్పుడు మీరు ఆల్ కాంటాక్ట్స్, కాంటాక్ట్స్ ఐ హావ్ చాట్ విత్ లేదా కస్టమ్ అనే మూడు ఆప్షన్లలో దేన్నైనా ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది ఒక దానిని ఎంచుకొని డన్ పై క్లిక్ చేయండి. వాట్సాప్ కొత్త మొబైల్ నంబర్‌తో అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అడుగుతుంది. ఇక కొత్త నెంబర్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మీ వాట్సాప్ నెంబర్ మారిపోతుంది . అంతేకాకుండా మీ వాట్సాప్ పాత చాట్స్ డిలీట్ అవ్వకుండా  యథావిధిగా కనిపిస్తాయి.   

Post a Comment

0 Comments

Close Menu