Ad Code

మహీంద్రా గ్రూప్, Jio-bp సంస్థల తాజా ఒప్పందం



ఈవీల తయారీ, సంబంధిత సేవల కోసం రిలయన్స్, మహీంద్రా గూప్ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. Jio-bp బ్రాండ్ నేమ్‌తో పనిచేసే రిలయన్స్ BP మొబిలిటీ లిమిటెడ్ (RBML), మహీంద్రా గ్రూప్‌తో తాజాగా ఎంఓయూ కుదుర్చుకుంది. EV ప్రొడక్ట్స్, సర్వీసెస్ కోసం రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఒప్పందంలో భాగంగా మహీంద్రా ఎలక్ట్రిక్ 3 వీలర్లు, 4 వీలర్లు, క్వాడ్రిసైకిల్స్, e-SCV (4 టన్ను కంటే తక్కువ బరువు ఉండే చిన్న వాణిజ్య వాహనాలు)తో సహా ఇతర వాహనాల కోసం Jio-bp ఛార్జింగ్ సొల్యూషన్స్‌ తయారు చేయాల్సి ఉంటుంది. EV ఉత్పత్తులు, సేవల రంగాల్లో రెండు కంపెనీలు బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పటికే ఉన్న Jio-bp స్టేషన్లను ఉపయోగించడంతో పాటు Jio-bp మొబిలిటీ స్టేషన్లు, EV ఛార్జింగ్, స్వాపింగ్ పాయింట్ల ఏర్పాటు కోసం మహీంద్రా గ్రూప్, సంస్థ ఛానెల్ పార్ట్నర్ పాయింట్లను ఇరు కంపెనీలు పరిశీలించనున్నాయి. Jio-bp ఇటీవల మహారాష్ట్రలో తన మొదటి మొబిలిటీ స్టేషన్‌ను ప్రారంభించింది. ఇది ప్రపంచ స్థాయి రిటైలింగ్ అనుభవాన్ని అందిస్తూ EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలతో సహా మల్టిపుల్ ఫ్యూయెలింగ్ ఆప్షన్లను అందిస్తోంది. అదనంగా మొబిలిటీ యాజ్ ఏ సర్వీస్ (MaaS), బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) వంటి బిజినెస్ మోడల్స్‌పై ఈ సంస్థ పనిచేయనుంది. మహీంద్రా గ్రూప్ తయారు చేసిన వాహనాలకు ఇక్కడ Jio-bp ఛార్జింగ్ సొల్యూషన్స్‌ అందించే అవకాశం ఉంది.భారతదేశంలో EV మార్కెట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ MoU ద్వారా డేటాబేస్, ఆపరేషన్స్ సపోర్ట్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్, పైలట్, కమర్షియల్ స్కేల్ బిజినెస్ మోడల్, ఛార్జింగ్, స్వాపింగ్ సౌకర్యాల రకాలను అన్వేషించడంతో పాటు అమలు చేయాలని Jio-bp, మహీంద్రా సంస్థలు ప్రతిపాదించాయి.

Post a Comment

0 Comments

Close Menu