Ad Code

త్వరలో 1000 నగరాల్లో జియో 5జీ సేవలు ?


టెలికాం దిగ్గజం జియో దేశంలో 1000 ప్రముఖ నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ కవరేజీని అందించేందుకు ప్రణాళిక పూర్తి చేసినట్లు వెల్లడించింది. 1000 ప్రముఖ నగరాలు అంటే దేశంలోని అన్ని ప్రముఖ పట్టణాల్లో 5 జీ నెట్ వర్క్ అందుబాటులోకి రానుందని చెప్పవచ్చు. ఈ మేరకు సంస్థ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటోంది. ఇంకా హెల్త్ కేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో అధునాతన సదుపాయాలను కల్పించేందుకు తమ 5జీ నెట్‌వర్క్‌తో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తమ తాజా ప్రకటనలో జియో వెల్లడించింది. భారత దేశంలో 5జీ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి కంపెనీ బృందాలను రూపొందించినట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ వెల్లడించారు. "దేశవ్యాప్తంగా 1,000 ప్రముఖ నగరాలకు 5జీ కవరేజ్ ప్రణాళిక పూర్తయిందన్నారు. జియో తన 5జీ నెట్‌వర్క్‌లో హెల్త్‌కేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌లో అధునాతన వినియోగాలపై ట్రయల్స్ చేస్తోందన్నారు. ప్రస్తుతం జియో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అంటే ప్రతీ వినియోగదారుడిపై వచ్చే సగటున వచ్చే ఆదాయం రూ.151.6 కు పెరగడం విశేషం. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 8.6 శాతం ఎక్కువగా నమోదైంది. ఇటీవల జియో తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఇంకా 2021 డిసెంబర్ నాటికి భారత్ లో జియో వినియోగదారుల సంఖ్య 42.1 కోట్లకు చేరింది. 2020తో పోలిస్తే దాదాపు కోటి మంది వినియోగదారులు జియోకు పెరిగారు. స్పెక్ట్రమ్ సంబంధిత బకాయిలన్నింటినీ టెలికం శాఖకు జియో ఇటీవలే ముందస్తుగా చెల్లించిన విషయం తెలిసిందే. 2021 మార్చి వరకు వడ్డీతో కలిపి మొత్తంగా రూ.30,791కోట్లను జియో చెల్లించింది. జియో తన నెట్‌వర్క్‌కు దాదాపు 12 మిలియన్ల కస్టమర్లను కొత్తగా చేర్చుకుంది. SIM కన్సాలిడేషన్ ప్రయత్నాల కారణంగా, సేవలను ఉపయోగించని వినియోగదారులను జాబితా నుండి Jio తొలగించింది. దీని కారణంగా, ఈ త్రైమాసికంలో జియో మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 84 లక్షలు తగ్గింది. జియో యొక్క కస్టమర్ బేస్ ఇప్పుడు 42 కోట్ల 10 లక్షలకు చేరువలో ఉంది. మరోవైపు, జియో ఫైబర్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కూడా 50 లక్షలు దాటింది.

Post a Comment

0 Comments

Close Menu