రూ.1,999 ధరకే నోయిస్ స్మార్ట్ వాచ్ ఆఫర్ !


స్మార్ట్ వాచ్ 1.69 లార్జ్ LCD డిస్ప్లే స్టైలిష్ డిజైన్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఎమ్మార్పీ ధర రూ.3,999 కాగా న్యూ ఇయర్ లాంచ్ అఫర్ క్రింద ఈ స్మార్ట్ వాచ్ ను కేవలం రూ.1,999 ధరకే ఆఫర్ చేయనున్నట్లు నోయిస్ ప్రకటించింది. అయితే, ఈ అఫర్ ధరను పొందడానికి ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం, ఫ్లిప్ కార్ట్ లేదా నోయిస్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు. ఈ Noise Color Fit Caliber ను ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా లాంచ్ చేస్తోంది మరియు ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ వాచ్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజ్ చేస్తోంది. ఈ బ్యానర్ ద్వారా చాలా ఫీచర్లను రివీల్ కూడా చేసింది. నోయిస్ ఈ స్మార్ట్ వాచ్ ను 2022 జనవరి 6వ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నది. ఈ స్మార్ట్ వాచ్ 5 అందమైన కలర్ అప్షన్ లలో కనిపిస్తోంది మరియు ప్రీమియం లుక్ ఇచ్చేలా Flat-Edge డిజైన్ తో ఈ స్మార్ట్ వాచ్ ను అందించింది. ఇందులో 1.69 ఇంచ్ పెద్ద LCD డిస్ప్లే 15- రోజుల నిలిచే బ్యాటరీని కూడా జతచేసినట్లు కంపెనీ చెబుతోంది. ఇందులో మీ వర్కవుట్ కోసం 60 Sports Modes ను కూడా అఫర్ చేస్తోంది. బాడీ టెంపరేచర్, బ్లడ్ ఆక్సిజన్ మోనిటర్, స్ట్రెస్ మోనిటర్, స్లీప్ మోనిటర్ మరియు 150 పైచిలుకు కష్టమైజబుల్ క్లౌడ్ వాచ్ ఫేస్ లను కూడా ఇందులో అందించింది. 

Post a Comment

0 Comments