Ad Code

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21ఎఫ్ఇ విడుదల !


దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ 2022 మొట్టమొదటి ఫ్లాగ్ షిప్ 5G స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21ఎఫ్ఇ  భారత మార్కెట్లో లాంచ్ అయింది. ట్రిపుల్ కెమెరాలు స్పెషల్ అట్రాక్షన్ కాగా.. 120Hz రిఫ్రెష్ రేటు, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి పలు ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. 8GB + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.49,999, 8GB+256GB వేరియంట్ ధర రూ. 53,999గా ఉంది. గెలాక్సీ S21 FE 5G మోడల్ ఫోన్.. రేపటి నుంచి (జనవరి 11) నుంచి ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌తో పాటు ఇతర ఆన్ లైన్ పోర్టల్స్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో, శాంసంగ్ కంపెనీ వెబ్ సైట్లలో అందుబాటులో ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21ఎఫ్ఇ ఫోన్ 12MP అల్ట్రా వైడ్ లెన్స్, 12MP మెయిన్ లెన్స్ సహా 8PM టెలిఫొటో సెన్సార్ కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి.. 32MPతో రానుంది. కెమెరా సిస్టమ్ డ్యుయల్ రికార్డింగ్‌, పొర్ట్రాయిట్ మోడ్, ఎన్ యాన్సడ్ నైట్ మోడ్, 30X స్పేస్ జూమ్ వంటి ఫీచర్లు యూజర్లను మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. Galaxy S21 FE 5G ఫోన్ 6.4 అంగుళాల FHD+ Dynamic AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటుతో వచ్చింది. 5nm Exynos 2100 ప్రాసెసర్, 4500mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. వైర్ లెస్ పవర్ షేర్ అండ్ వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0 సపోర్టు అందిస్తుంది. 25W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రిసిస్టెంట్ ప్రొటెక్షన్ కూడా ఉంది. Galaxy S21 FE 5G ఫోన్ మొత్తం Olive, Lavender, White, Graphite కలర్ ఆప్షన్లలో వచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu