అందుబాటు ధరలోనే యు బ్రాడ్‌బ్యాండ్ 350 Mbps ప్లాన్

 

ఇండియాలోని ప్రైవేట్ టెల్కోలలో ఒకటైన వొడాఫోన్ ఐడియా(Vi) సంస్థ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో యు బ్రాడ్‌బ్యాండ్ పేరుతో వినియోగదారులకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందిస్తున్నది. అధిక వేగంతో లభించే మెరుగైన ప్లాన్ల కోసం మీరు చూస్తున్నట్లయితే యు బ్రాడ్‌బ్యాండ్ మీకు మంచి ఎంపిక కావచ్చు. వొడాఫోన్ ఐడియా అనుబంధ సంస్థ యు ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు దాని 350 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కేవలం రూ.1750 ధరకే అందిస్తోంది. ఈ ప్లాన్ అపరిమిత డేటాతో లభించడమే కాకుండా వివిధ వాలిడిటీ కాన్ఫిగరేషన్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. దీర్ఘకాలిక చెల్లుబాటు ప్లాన్‌లతో యు బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌లకు అదనపు వాలిడిటీ సర్వీస్ ప్రయోజనాలను అందిస్తుంది. 350 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో కంపెనీ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ ఫిగర్‌ను పూర్తి చేయడానికి 300 Mbps స్పీడ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది.  యు బ్రాడ్‌బ్యాండ్ కంపెనీ తన యొక్క వినియోగదారులకు 350 Mbps స్పీడ్ ప్లాన్ ను రూ.1750 ధర వద్ద అందుబాటులో ఉంది. అన్ని రకాల పన్నులతో కలుపుకొని ఈ ప్లాన్ మొత్తం ధర నెలకు రూ.2065గా ఉంటుంది. ఇంకా వినియోగదారులు మూడు నెలలు, ఆరు నెలలు మరియు పన్నెండు నెలల చెల్లుబాటుతో కూడా ఈ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. త్రైమాసిక ప్లాన్‌తో యు బ్రాడ్‌బ్యాండ్ ఐదు రోజుల అదనపు సర్వీసును ఉచితంగా అందిస్తుంది. అదేవిధంగా ఆరు నెలల మరియు పన్నెండు నెలల వాలిడిటీ ప్లాన్‌లతో వినియోగదారులు కంపెనీ నుండి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వరుసగా పది రోజులు మరియు 15 రోజుల అదనపు సర్వీస్ వాలిడిటీని పొందుతారు. త్రైమాసిక, ఆరు నెలలు మరియు పన్నెండు నెలల చెల్లుబాటుతో లభించే ఈ ప్లాన్‌ వినియోగదారులకు వరుసగా రూ. 6195, రూ. 12,390 మరియు రూ.24,780 ధరల వద్ద లభిస్తుంది. ఇక్కడ పేర్కొన్న ధరలో పన్నులు కూడా ఉన్నాయని గమనించండి. డేటా విషయానికి వస్తే ఇది నెలకు 3.5TB డేటాను అందిస్తుంది. మీకు కంపెనీ నుండి రౌటర్ మరియు మోడెమ్ కావాలంటే సెక్యూరిటీ డిపాజిట్‌గా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. యు బ్రాడ్‌బ్యాండ్ కంపెనీ తన యొక్క వినియోగదారులకు 300 Mbps స్పీడ్ తో మరొక ప్లాన్ ను అందిస్తుంది. ఇది నెలకు రూ.2006 ధర వద్ద అందుబాటులో ఉంది (పన్నులు కూడా ఉన్నాయి). అదేవిధంగా మూడు నెలలు, ఆరు నెలలు మరియు పన్నెండు నెలల వాలిడిటీ కాలానికి ఈ ప్లాన్‌ను వరుసగా రూ.6018, రూ.12036 మరియు రూ.24072 ధరల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌తో అందించే డేటా కూడా 3.5TB. రూటర్ మరియు మోడెమ్ కోసం కస్టమర్‌లు రూ.1999 అదనపు డిపాజిట్ మొత్తాన్ని చేయాల్సి వస్తుంది. ఇది ఒక్కసారి తిరిగి చెల్లించే డిపాజిట్. 3.5TB డేటాతో వచ్చే కంపెనీ అందించే మరిన్ని ప్లాన్‌లు ఉన్నాయి.

Post a Comment

0 Comments