పెళ్లి అయిన 8 నెలలకే విడాకులువరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన సినిమా కొత్త బంగారులోకం. ఈ మూవీతో శ్వేతా బసు ఒక్కసారి స్టార్ హీరోయిన్ గా మారింది. ఎకాడా అంటూ ఈ సినిమాలో తను చెప్పిన డైలాగ్ కుర్రకారు మదిలో నిలిచిపోయింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత తనకు చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలు తనకు అంతగా కలిసి రాలేదు. అన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో తను ఈజీ మనీకోసం చాలా తప్పులు చేసింది.. ఈ క్రమంలోనే వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయింది. ఆ తర్వాత తను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ సమస్యల నుంచి బయటపడిన తను బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత వివాహం చేసుకుంది. ఎంతో ఘనంగా వీరి పెళ్లి జరిగింది. అయితే కేవలం 8 నెలలకే వీరి పెళ్లి పెటాకులు అయ్యింది. వాస్తవానికి శ్వేత చాలా వివాదాల్లో ఉంది. ఆ విషయాలు అన్నీ రోహిత్ కు తెలుసు. ఆ విషయాలు తెలిసే తనను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత పాత విషయాల గురించి పదే పదే ప్రస్తావించేవాడట. దీంతో తను బాగా విసిగిపోయిందదట.. చివరు తనకు విడాకులు ఇచ్చిందట. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పింది.

Post a Comment

0 Comments