Ad Code

వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్


వన్‌ప్లస్ 9ఆర్‌టీ మోడల్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది కంపెనీ. ఇప్పటికే వన్‌ప్లస్ 9 సిరీస్‌లో వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9ఆర్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ఇప్పటికే ఇండియన్ మార్కెట్‌లో ఉన్న వన్‌ప్లస్ 9ఆర్ మోడల్‌కు కొన్ని అప్‌గ్రేడ్స్‌తో వన్‌ప్లస్ 9ఆర్‌టీ వచ్చింది. త్వరలో రిలీజ్ కాబోయే షావోమీ 11టీ ప్రో మోడల్‌కు ఈ స్మార్ట్‌ఫోన్ గట్టి పోటీ ఇస్తుందని అంచనా. వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్లతో రిలీజ్ అయింది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.42,999 కాగా, 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.46,999. జనవరి 17న అమెజాన్ గ్రేట్ ఇండియన్ రిపబ్లిక్ డే సేల్‌లో వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ ఇండియా ఇ-స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనొచ్చు. బ్లాక్, సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు. వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండటం విశేషం. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. హైపర్ టచ్ 2.0, రీడింగ్ మోడ్, నైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + ఆక్సిజన్ ఓఎస్ 11.3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. వార్ప్ ఛార్జ్ 65టీ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. డ్యూయెల్ నానో సిమ్ సపోర్ట్ లభిస్తుంది. డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ Sony IMX766 ప్రైమరీ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, మల్టీ ఆటోఫోకస్, సూపర్ స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, నైట్ మోడ్, మ్యాక్రోమోడ్, సీన్ ఎన్‌హ్యాన్స్‌మెంట్, పోర్ట్‌రైట్ మోడ్, ప్రో మోడ్, పనోరమా, రా, ఫిల్టర్స్, వీడియో పోర్ట్‌రైట్, ఫోకస్ ట్రాకింగ్, ఆడియో ట్రాకింగ్, డ్యూయెల్ వ్యూ, లాంగ్ ఎక్స్‌పోజర్ మోడ్, మూవీ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం. ఫ్రంట్ కెమెరాలో ఫేస్ అన్‌లాక్, హెచ్‌డీఆర్, స్క్రీన్ ఫ్లాష్, ఫేస్ రీటచింగ్, నైట్‌స్కేప్ సెల్ఫీ, సెల్ఫీ హెచ్‌డీఆర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu