Ad Code

జియో ఇ-సిమ్ తో సిమ్ కార్డ్ అవసరం లేదు!


రిలయన్స్ జియో స్మార్ట్‌ఫోన్లకు ఇ-సిమ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇ-సిమ్ వాడుకోవాలంటే ఆ స్మార్ట్‌ఫోన్లకు ఈ సపోర్ట్ ఉండాలి. స్మార్ట్‌ఫోన్ తయారుచేసే బ్రాండ్స్ తమ మొబైల్‌లో స్పేస్‌ను తగ్గించుకోవడం కోసం ఇ-సిమ్ సపోర్ట్ అందిస్తున్నాయి. టెలికామ్ కంపెనీలు కూడా ఇ-సిమ్ ఫీచర్ అందిస్తుంటడంతో స్మార్ట్‌ఫోన్ తయారుచేసేప్పుడు స్పేస్ తగ్గుతుంది. స్మార్ట్‌ఫోన్‌ను ఇంకాస్త తక్కువ బరువుతో తయారు చేయడానికి వీలవుతుంది. ఫిజికల్ సిమ్ అవసరం లేదు. యాపిల్, శామ్ సంగ్ లాంటి కంపెనీలు ఇ-సిమ్ సపోర్ట్‌తో స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేస్తున్నాయి. ఆ స్మార్ట్‌ఫోన్లు కొన్న కస్టమర్లు ఇ-సిమ్ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ యాక్టివేట్ చేసే విధానం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ను బట్టి మారుతుంది. ఏ స్మార్ట్‌ఫోన్లకు జియో ఇసిమ్ సపోర్ట్ లభిస్తుందో https://www.jio.com/en-in/esim వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. యూజర్లు ముందుగా దగ్గర్లోని జియో స్టోర్ లేదా జియో రీటైలర్ దగ్గరకు వెళ్లి కొత్త సిమ్ తీసుకోవాలి. మరి యాపిల్ రిలీజ్ చేసిన ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎస్ఈ (2020), ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 12, ఐఫోన్ ఎక్స్ఎస్ లాంటి మోడల్స్ ఉపయోగిస్తున్నవారి స్మార్ట్‌ఫోన్లలో ఐఓఎస్ 12.1 కన్నా ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. పైన లిస్ట్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారు ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత జనరల్ క్లిక్ చేయాలి. ఈఐడీ, ఐఎంఈఐ నెంబర్లు ఉంటాయి. వాటిని నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత SMS GETESIM అని టైప్ చేసి ఈఐడీ, ఐఎంఈఐ నెంబర్లు టైప్ చేసి 199 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీకు 19 అంకెల ఇ-సిమ్ నెంబర్, ఇ-సిమ్ ప్రొఫైల్ కాన్ఫిగరేషన్ వివరాలు వస్తాయి. SMS SIMCHG అని టైప్ చేసి 19 అంకెల ఇ-సిమ్ నెంబర్ ఎంటర్ చేసి 199 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. రెండు గంటల్లో మీకు మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత 1 అని టైప్ చేసి 183 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఆ తర్వాత ఆటోమేటెడ్ కాల్ వస్తుంది. కన్ఫామ్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. కాన్ఫిగర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డేటా ప్లాన్ ఎంచుకొని కంటిన్యూ చేయాలి. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే సెట్టింగ్స్‌లో జియో డేటా ప్లాన్ ఎంచుకోవాలి. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్, గెలాక్సీ జెడ్ ఫ్లిక్, గెలాక్సీ నోట్ 20, గెలాక్సీ నోట్ 20 అల్‌ట్రా 5జీ, గెలాక్సీ ఎస్21 5జీ, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2, గెలాక్సీ ఎస్21 అల్‌ట్రా 5జీ, గెలాక్సీ ఎస్21+ 5జీ, గెలాక్సీ ఎస్20+, గెలాక్సీ ఎస్20 అల్‌ట్రా, గెలాక్సీ ఎస్20 యూజర్లు  ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఎబౌట్ ఫోన్ క్లిక్ చేసి ఐఎంఈఐ నెంబర్, స్టేటస్ ఇన్ఫర్మేషన్‌లో ఈఐడీ నెంబర్ నోట్ చేసుకోవాలి. GETESIM అని టైప్ చేసి ఈఐడీ నెంబర్, ఐఎంఈఐ నెంబర్ టైప్ చేసి 199 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. 19 అంకెల ఇ-సిమ్ నెంబర్, ఇ-సిమ్ ప్రొఫైల్ కాన్ఫిగరేషన్ వివరాలు, 32 అంకెల యాక్టివేషన్ కోడ్ వస్తాయి.  ఆ తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసి కనెక్షన్స్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత సిమ్ కార్డ్ మేనేజర్ క్లిక్ చేయాలి. ఇసిమ్‌లో మొబైల్ ప్లాన్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత స్కాన్ క్యారియర్ క్యూఆర్ కోడ్ క్లిక్ చేయాలి. తర్వాతి స్క్రీన్‌లో 32 అంకెల యాక్టివేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కనెక్ట్ పైన క్లిక్ చేస్తే జియో ఇ-సిమ్ యాక్టివేట్ అవుతుంది.

Post a Comment

0 Comments

Close Menu