Header Ads Widget

జియోమీ నుంచి హైపర్‌ఫోన్‌... ?


జియోమీ తాజాగా భారత మార్కెట్‌లో జియోమీ 11ఐ సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అయితే.. త్వరలో హైపర్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేస్తామని ఈవెంట్‌లో ప్రకటించింది.సూపర్ ఫాస్ట్ ఫోన్ అన్నమాట. ఆ హైపర్‌ఫోన్ ఏంటి.. ఎటువంటి ఫీచర్లతో ఆ ఫోన్ లాంచ్ కాబోతోంది అని స్మార్ట్‌ఫోన్ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. టెక్ నిపుణుల అంచనా ప్రకారం.. జియోమీ లాంచ్ చేయబోయే స్మార్ట్‌ఫోన్ 11టీ ప్రో అంటూ చెబుతున్నారు. ఈ ఫోన్‌ను యూరప్‌లో గత సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ చేసింది. అదే ఫోన్‌ను హైపర్‌ఫోన్ పేరుతో భారత్‌లో లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 12జీబీ ర్యామ్‌, 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి బెస్ట్ ఫీచర్లు ఉన్నారు. అలాగే.. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ఎస్‌వోసీ, 120 హెచ్‌జెడ్ ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లే లాంటి ఫీచర్లు ఈ ఫోన్ సొంతం. ఈ హైపర్‌ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా జియోమీ ఈవెంట్‌లో డిస్‌ప్లే చేసింది. యూరప్‌లో లాంచ్ చేసిన ఫోన్ 11టీ ప్రో ఫీచర్లనే ఈ హైపర్‌ఫోన్‌లోనూ జియోమీ అందివ్వనున్నట్టు తెలుస్తోంది. 8జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లతో జియోమీ 11టీ మోడల్ ఫోన్‌ను కూడా లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. 11టీ ప్రో మాత్రం మూడు వేరియంట్లు 8జీబీ ప్లస్ 128 జీబీ, 8 జీబీ ప్లస్ 256 జీబీ, 12 జీబీ ప్లస్ 256 జీబీతో లాంచ్ కానుంది. 11టీ ప్రో 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర సుమారుగా రూ.54,600 ఉంటుందని తెలుస్తోంది. 8 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ అయితే రూ.58,800, 12 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ అయితే రూ.63,000గా ఉండనుంది. 6.67 ఇంచ్ 10 బిట్ ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ఎస్‌వోసీ, ట్రిపుల్ కెమెరా, 108 ఎంపీ రేర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 డబ్ల్యూ జియోమీ హైపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లు జియోమీ 11టీ ప్రోలో ఉండనున్నాయి.

Post a Comment

0 Comments