Ad Code

రంగులు మార్చుకునే కారు!


జర్మనీకి చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ BMW ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తో ఓ కారును తీసుకొచ్చింది. రంగులు మార్చుకునే ఊసరవెల్లి మాదిరిగానే ఈ కారు కూడా త్వరలో రోడ్లపై కనిపించి కనువిందు చేయనుంది. బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఫ్లో ( BMW iX Flow) ఈ కారుకు పెట్టిన పేరు. ఇందులో ఎలక్ట్రోఫొరెటిక్ టెక్నాలజీని వినియోగించారు…రంగులు మార్చే కిటుకు దీంట్లోనే ఉంటుంది. అంటే గ్రాఫిక్స్ తో కూడిన టెక్నాలజీతో రంగులు మారుతాయన్నమాట. కాకపోతే మనకు బ్లూ లేదా రెడ్..లేదా మరో కలర్ మారాలి అనుకుంటే మాత్రం అస్సలు కుదరదు. అంటే మనకు నచ్చిన రంగులోకి మారే అవకాశం లేదు. కానీ బ్లాక్ నుంచి వైట్ కు లేదా కంబైన్ బ్లాక్ రంగుల్లోకి, వైట్ నుంచి బ్లాక్ కు రంగును మార్చుకునే అవకాశముంటుంది. ఈ రంగులు మార్చుకునే టెక్నాలజీ గురించి BMW గ్రూపు వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫ్ గ్రోటే మాట్లాడుతు..''ఒక టెక్నాలజీని సృష్టించి దాన్ని కారులో అమలు చేసే ప్రయత్నమే ఇది అని..ఆ టెక్నాలజీయే రంగు మార్చుకునేలా చేస్తుందని తెలిపారు. ఎక్కువ వేడి ఉన్న వాతావరణంలో కారు వెళుతున్నప్పుడు నల్ల రంగు నుంచి తెలుపు రంగులోకి మారిపోతే అప్పుడు వాహనం సామర్థ్యం ఇనుమడిస్తుందని..కారు లోపల సమతుల ఉష్ణోగ్రతకు సాయపడుతుందని తెలిపారు

Post a Comment

0 Comments

Close Menu