Ad Code

జియో యూజర్లకు హెచ్చరిక ?


ఈ-కేవైసీ అంటూ వచ్చే ఫేక్ మెసేజెస్‌కు స్పందించవద్దని జియో తన వినియోగదారులను హెచ్చరించింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇప్పటికే తమ వినియోగదారులకు దీనికి సంబంధించిన అలెర్ట్‌ను అందించారు. ఈ-కేవైసీ గురించి తమ తరఫు నుంచి ఎటువంటి మెసేజ్‌లు రావని, వాటికి అస్సలు స్పందించవద్దని వినియోగదారులను కోరింది. కొత్త సంవత్సరం సందర్భంగా స్కామ్ కాల్స్ మరింత పెరిగిపోయే అవకాశం ఉందని తెలిపారు. న్యూ ఇయర్, పండుగ ఆఫర్లు అంటూ ఏవైనా లింకులు కనిపిస్తే వాటిని అస్సలు క్లిక్ చేయవద్దని తెలిపింది. ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలంటూ వచ్చే కాల్స్‌కు కూడా అస్సలు స్పందించవద్దని కోరింది. తెలియని వ్యక్తులతో బ్యాంకు వివరాలను పంచుకోవద్దని హెచ్చరించింది.

Post a Comment

0 Comments

Close Menu