Ad Code

టాటా ప్లేగా మారిన టాటా స్కై...!


టాటా స్కై ఇప్పుడు టాటా ప్లేగా మారింది. ఇకపై టాటా స్కై యూజర్లు టాటా ప్లే సేవల్ని పొందొచ్చు. టాటా ప్లేగా మారిన టాటా స్కై కొత్త ప్లాన్స్‌ని కూడా అందిస్తోంది. ఇప్పటికే ఉన్న ప్లాన్స్‌తో పాటు కొత్తగా టాటా ప్లే ప్యాక్స్‌ని ప్రకటించింది. ఓటీటీ సేవలు కావాలనుకునేవారు ఈ ప్లాన్స్ పొందొచ్చు. టాటా ప్లే ప్యాక్స్ కేవలం రూ.389 నుంచి ప్రారంభం అవుతాయి. టాటా ప్లే పేరుతో సెట్ టాప్ బాక్సులు కూడా వచ్చాయి.  టాటా ప్లే ఎస్‌డీ సెట్ టాప్ బాక్స్ ధర రూ.1699. పీసీఎం సౌండ్, షోకేస్ మూవీస్, పేరెంటల్ కంట్రోల్ ఫీచర్, ఆటో స్టాండ్‌బై లాంటి ఫీచర్స్ ఉన్నాయి. టాటా ప్లే హెచ్‌డీ సెట్ టాప్ బాక్స్ ధర రూ.1899. ఈ బాక్సుతో 500 పైగా ఛానెళ్లు చూడొచ్చు. త్రీడీ కంపాటబుల్, పీసీఎం సౌండ్, షోకేస్ మూవీస్, పేరెంటల్ కంట్రోల్ ఫీచర్, ఆటో స్టాండ్‌బై లాంటి ఫీచర్స్ ఉన్నాయి. టాటా ప్లే బింజ్+ స్మార్ట్ సెట్ టాప్ బాక్స్ ధర రూ.2499. సెట్ టాప్ బాక్స్, బింజ్ సర్వీస్ ఉచితం. టాటా ప్లే బింజ్ ఒక నెల ఉచితం. 12 ఓటీటీ యాప్స్ యాక్సెస్ చేయొచ్చు. దీంతో పాటు ఒక నెల అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచితం. త్రీడీ కంపాటబుల్, 4ఎక్స్ షార్పర్ పిక్చర్, బిల్ట్ ఇన్ క్రోమ్‌క్యాస్ట్, గూగుల్ అసిస్టెంట్‌తో పనిచేసే వాయిస్ సెర్చ్ రిమోట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 2జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. టాటా ప్లే+ హెచ్‌డీ సెట్ టాప్ బాక్స్ ధర రూ.4,999. త్రీడీ కంపాటబుల్, పీసీఎం సౌండ్, డాల్బీ డిజిటల్ ప్లస్, పేరెంటల్ కంట్రోల్ ఫీచర్, షోకేస్ మూవీస్ లాంటి ఫీచర్స్ లభిస్తాయి. ఓటీటీ సేవల్లో నెట్‌ఫ్లిక్స్‌ని కూడా చేర్చింది టాటా ప్లే. మొత్తం 14 ఓటీటీ సేవలు పొందొచ్చు. కోటి 90 లక్షల మంది టాటా స్కై సబ్‌స్క్రైబర్లు టాటా ప్లే సబ్‌స్క్రైబర్స్‌గా మారారు.టాటా ప్లే రూ.175 విజిటింగ్ ఛార్జీలను తొలగించిన సంగతి తెలిసిందే. రీఛార్జ్ చేయని డీటీహెచ్ కస్టమర్లకు రీకనెక్షన్స్ ఉచితంగా లభిస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu