Ad Code

శామ్‌సంగ్ నుంచి మరో కొత్త ఫోన్


దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్ కొత్త సంవత్సరంలో సరికొత్త Galaxy S21 FE ఫోన్‌ను లాంచ్ చేసింది. అత్యాధునిక ఫీచర్స్‌తో, స్టైలీష్ డిజైన్‌తో ఆకట్టుకునేలా ఉంది. 5G నెట్‌వర్క్ సపోర్ట్‌తో వస్తుంది. మంచి అనుభుతిని కలిగించే నైట్ మోడ్‌ను కలిగి ఉంది. చీకట్లో కూడా మెరుగైన ఫొటోలను తీయవచ్చు. కాంటూర్-కట్ ఫ్రేమ్ డిజైన్, ఎలివేటెడ్ రియర్ కెమెరా మాడ్యూల్‌తో గెలాక్సీ సిరీస్ వారసత్వాన్ని కొనసాగిస్తుందని కంపెనీ తెలిపింది. 6.4-అంగుళాల పూర్తి-HD+ డైనమిక్ AMOLE 2X డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. వెనుక భాగంలో12MP అల్ట్రా-వైడ్, 8MP టెలిఫొటో కెమెరాతో పాటు, వైడ్ యాంగిల్ లెన్స్‌తో 12MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీలకోసం ముందు భాగంలో 32MP కెమెరాను కలిగి ఉంది. Android 12 వన్ UI 4తో Snapdragon 888పై రన్ అవుతుంది. బ్యాటరీ సామర్థ్యం 4,500mAh, ఇది 25W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ ఇస్తుంది. IP68-సర్టిఫైడ్ బిల్డ్‌లో వాటర్/డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఇది కొంత వరకు దుమ్ము, నీటిని నిరోధించడంలో సహాయపడుతుంది. కొత్త మోడల్ గ్రాఫైట్, లావెండర్, ఆలివ్, వైట్ కలర్‌లలో లభిస్తుంది. 7.9mm, 177gm బరువుతో సన్నగా, తేలికగా ఉంటుంది. ఇది రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. 6GB RAM 128 GB స్టోరెజ్ ధర రూ.70,200. 8GB RAM 256GB స్టోరెజ్ ధర రూ.75,200.

Post a Comment

0 Comments

Close Menu