Ad Code

ట్రాక్టర్ కు టైర్లు భిన్నంగా ఎందుకు ఉంటాయి?


సాధారణంగా ట్రాక్టర్‌కు మొత్తం నాలుగు చక్రాలు ఉంటాయి. వాటిలో ముందు రెండు చిన్నవి.. మరియు వెనుక రెండు పెద్దవిగా ఉంటాయి. ట్రాక్టర్ ఇంజిన్ చాలా శక్తివంతమైనదని అనుకుంటాం. అయితే ఇది నిజం కాదు. ట్రాక్టర్ బరువైన వస్తువులను సులభంగా లాగుతుంది. కారు ఇంజన్ కూడా ట్రాక్టర్‌తో సమానంగా శక్తివంతమైనది. ట్రాక్టర్‌లోని టార్క్ (చక్రాన్ని తిప్పడం లేదా లాగడం) కారు మరియు ఇతర వాహనం కంటే ఒకటిన్నర రెట్లు అధికం. గేర్ల సహాయంతో ట్రాక్టర్ వేగాన్ని తగ్గించడం ద్వారా, ఇది కారు కంటే ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ట్రాక్టర్ కూడా అధిక భారాన్ని లాగుతుంది. దాని పెద్ద చక్రం గురించి ప్రస్తావనకు వస్తే కారు మరియు బైక్ కంటే.. ఎక్కువ మట్టి లేదా బురద ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్ తన పనిని సులభంగా నిర్వహిస్తుంది. తక్కువ ట్రాక్షన్ కారణంగా, కారు లేదా బైక్ బురదలో కూరుకుపోతుంది. కానీ వెనుక టైరు పెద్దది కావడంతో ట్రాక్టర్ సులువుగా ముందుకు కదులుతుంది. ట్రాక్టర్‌లో పెద్ద పెద్ద టైర్లను అమర్చడం ద్వారా, టైర్ బురదలో కూరుకుపోదు.  గట్టి పట్టును అందుకుంటుంది. ట్రాక్టర్ ముందు రెండు చక్రాలు చిన్నవిగా ఉంటాయి, తద్వారా మలుపులో దానిని తిప్పడం సులభం. ట్రాక్టర్ ఇంజిన్ ముందుకు ఉంటుంది. కాబట్టి బరువు సమానంగా ఉంచడానికి, వెనుక పెద్ద చక్రాలను ఇన్ స్టాల్‌ చేయడం అవసరం. అవి లోడ్‌ను లాగేటప్పుడు ట్రాక్టర్ ముందు నుండి పైకి లేవకుండా ఉండేందుకు పట్టును అందిస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu