Ad Code

ఒమిక్రాన్ వేగానికి కారణం తెలిసింది ?


ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాని వేగానికి కారణాన్ని తేల్చేందుకు జపాన్‌కు చెందిన పరిశోధకులు పరిశోధన చేశారు. అందులో చాలా అసక్తికరమైన విషయాలు బయటికొచ్చాయి. మనిషి చర్మంపై ఒమిక్రాన్‌ వేరియంట్‌ 21గంటల పాటు సజీవంగా ఉంటుందనీ అదే ప్లాస్టిక్‌ ఉపరితలంపైన దాదాపు 8 రోజుల పాటు జీవించి ఉంటుందని క్యోటో ప్రీఫెక్చురల్ యూనివర్సిటీ ఆఫ్‌ మెడిసిన్ పరిశోధకుల బృందం గుర్తించింది. ఒమిక్రాన్‌ ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తి చెందడానికి కారణం కూడా ఇదేనని తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం ఒరిజినల్‌ స్ట్రెయిన్‌ 56 గంటలు, ఆల్ఫా 191.3, బీటా 156.6 గంటలు, గామా 59.3గంటలు, డెల్టా 114 గంటల పాటు ప్లాస్టిక్‌ ఉపరితలాలపై జీవించగలవని గుర్తించారు. చర్మం నమూనాపై ఒమిక్రాన్‌ 21.1గంటల పాటు సజీవంగా ఉండగా.. ఒరిజినల్‌ స్ట్రెయిన్‌ 8.6 గంటలు, ఆల్ఫా 19.6 గంటలు, బీటా 19.1 గంటలు, గామా 11గంటలు, డెల్టా వేరియంట్‌ 16.8గంటలు సజీవంగా ఉన్నట్టు తెలిపారు. ఫ్యూర్ ఆల్కాహాల్‌తో తయారైన శానిటైజర్‌తో చేతుల్ని శుభ్రం చేసుకుంటే 15 సెకన్లలోనే వైరస్‌ అంతమవుతుందని రీసర్చర్స్ తెలిపారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించినట్లు తరచూ శానిటైజర్లతో చేతుల్ని శుభ్రం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.


Post a Comment

0 Comments

Close Menu