Ad Code

చాట్‌ హిస్టరీని ఇంకొక ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడం ఎలా ?


మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులు తమ చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ ఫోన్ నుండి ఐఫోన్‌ డివైజ్‌లకు మర్చడానికి అనుమతించే ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తున్నట్లు సమాచారం. వినియోగదారులు వారి చాట్‌లను iPhoneలకు తరలించేలా చేస్తుంది. కంపెనీ మొదట అక్టోబర్‌లో దీనిని ప్రవేశపెట్టింది. ఇది iOS వినియోగదారులు తమ చాట్‌లను Samsung, Google Pixel ఫోన్‌లకు బదిలీ చేయడానికి అనుమతించింది. తరువాత మరిన్నింటికి విస్తరించాలని చూస్తోంది. iOS v22.2.74 కోసం తాజా WhatsApp బీటాలో ఈ ఫీచర్ డెవలప్‌మెంట్‌లో ఉంది. ప్రస్తుతం, ఇది అందరికీ అందుబాటులో లేదు. మూవ్ టు iOS అనే యాప్‌పై పనిచేస్తుంది. కాంటాక్ట్‌లు, మెసేజ్ హిస్టరీ, ఫోటోలు, ఇమెయిల్ ఖాతాల వంటి కంటెంట్‌ను సురక్షితంగా బదిలీ చేయడానికి అనుమతించే 'మూవ్ టు iOS' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. డేటా ట్రాన్స్‌ఫర్ ఎంచుకున్న తర్వాత, యాప్ ప్రైవేట్ Wi-Fi నెట్‌వర్క్‌ను సృష్టిస్తుంది. దగ్గరలోని Android డివైజ్ కోసం సెర్చ్ చేస్తుంది. ఒకదాన్ని ఎంచుకున్న తరువాత, భద్రతా కోడ్‌ను నమోదు చేసాకా బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెషన్ సమయంలో వినియోగదారులు తమ ఫోన్‌లు, యాప్‌లను అన్‌లాక్ చేసి ఉంచుకోవాలి. తాజా ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌లో నడుస్తున్న వారికి మాత్రమే ఐఓఎస్ నుండి ఆండ్రాయిడ్ బదిలీ ఉంటుందని WABetaInfo గతంలో ఒక ట్వీట్‌లో పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu