Ad Code

గూగుల్ స్మార్ట్ వాచ్!


గూగుల్ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎన్నో బ్రాండెడ్ గల వస్తువులు వచ్చాయి. తాజాగా స్మార్ట్ వాచ్ ల పైన కూడా తన ఫోకస్ ను పెడుతోంది. గూగుల్ నుంచి మొదటిసారిగా ఒక పిక్సెల్ స్మార్ట్ వాచ్ ని త్వరలో విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ వాచ్ ఈ ఏడాది మే 26వ తేదీన విడుదలవుతున్నట్లు టెక్ నిపుణులు తెలియజేశారు. అయితే ఈ విషయం అధికారికంగా గూగుల్ ప్రకటించలేదు.. ఆన్ లైన్ లో మాత్ర మే 26న విడుదల కాబోతోంది అన్నట్లుగా వార్తలు బాగా వైరల్గా అవుతున్నాయి.. ఇక ఆ రోజున ఎందుకు అనుకుంటున్నారు అంటే.. ఆ రోజున గూగుల్ ఇన్ పుట్, అవుట్ పుట్ కు సంబంధించి ఒక కాన్ఫరెన్స్ ఉంది.. అందులో గూగుల్ కు సంబంధించి కొన్ని అప్ గ్రేడ్ విషయాలను అనౌన్స్ చేయనుంది. అందుచేతనే ఆ రోజున ఈ స్మార్ట్ వాచ్ గురించి తెలియజేస్తున్నట్లుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ స్మార్ట్ వాచ్ మాత్రం సరి కొత్త ఫీచర్లను గూగుల్ అమర్చి కస్టమర్లకు అందించనున్నట్లు తెలుస్తోంది.. గూగుల్లో ఇప్పటివరకు కేవలం వియర్ ఓఎస్ వాచ్ లు మాత్రమే వెలువడ్డాయి. అవి పూర్తి స్థాయిలో గూగుల్ సంస్థ తయారు చేసినవి కావట.. కేవలం మొదటిసారిగా గూగుల్ బ్రాండ్ నుంచి వస్తున్నది ఈ పిక్సెల్ వాచ్ మాత్రమేనట. అందుకోసమే వియర్ ఓఎస్ లేని వాచ్ లో లేని కొన్ని ఫీచర్లను ఈ గూగుల్ స్మార్ట్ వాచ్ లో అందించనుందట. ఇక ఇందులో టెన్సర్ చిప్, సిగ్నల్స్ ట్రాకింగ్, స్టెప్ కౌంటింగ్, ఫీట్ బిట్, హార్ట్ రేట్.. ఇంటిగ్రేషన్ లాంటి ఫీచర్లను ఈ పిక్సెల్ స్మార్ట్ వాచ్ లో అందిస్తోంది. వాస్తవానికి కి గూగుల్ పిక్సెల్ -6 స్మార్ట్ మొబైల్ తోనే దీనిని కూడా లాంచ్ చేయాలని భావించిందట.. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది.. ఆ స్మార్ట్ ఫోన్ ఈ నెల 31న విడుదల కాబోతోంది.

Post a Comment

0 Comments

Close Menu