Ad Code

అన్నిటికీ ఒక్కటే డిజిటల్ కార్డు?


కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును పోలిన మరో కార్డును రూపొందించే కసరత్తు ప్రారంభిస్తోంది. ఈ అంశంపై ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపిన వివరాలు ప్రకారం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ నంబర్లు, పాన్ వంటి బహుళ డిజిటల్ ఐడిలను లింక్ చేయడానికి ప్రభుత్వం "ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్" కొత్త మోడల్ రూపొందించేందుకు పని చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం దేశ పౌరులు ప్రభుత్వ సేవల కోసం ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్ట్ వంటి ప్రభుత్వ ఐడీ  లను వాడుతున్న సంగతి తెలిసిందే. వీటి స్థానంలో ఒకే డిజిటల్ ఐడీ ఉంటే బెటర్ అని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదిత ఫ్రేమ్‌వర్క్ కొత్త డిజిటల్ ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదిక తెలుపుతుంది. వేగవంతమైన పనితీరు, కచ్చితమైన ఫలితాల కోసం 'ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీ ఉపయోపడేలా రూపొందిస్తున్నట్టు సమాచారం. భవిష్యత్‌లో వ్యక్తిగత కేవైసీ ప్రక్రియ అన్ని విభాగాల్లో సులభం అవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఈ కొత్త డిజిటల్ ఐడిఅకారణంగా ఆధార్ కార్డ్ నంబర్ మాదిరిగానే ఒక ప్రత్యేక ఐడి రూపొందించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని సమాచారం. ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీ అనేది సెంట్రల్ అండ్ స్టేట్-సంబంధిత ఐడి డేటాను నిల్వ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ డిజిటల్ ID KYC లేదా eKYC (నౌ యువర కస్టమర్‌) ప్రక్రియల కోసం ఉపయోగించవచ్చు. సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడం కోసం దేశంలో ఈ-గవర్నెన్స్ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఎలక్ట్రానిక్ సర్వీసులను, ప్రొడక్టులను, డివైజ్‌లను, ఉద్యోగ అవకాశాలను కవర్ చేస్తుంది. దీంతో పాటు దేశంలో ఎలక్ట్రానిక్  తయారీని కూడా బలోపేతం చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ప్రభుత్వం తాజా ప్రతిపాదనపై విమర్శకులు డిజిటల్ భద్రతతో సమస్యలను లేవనెత్తే అవకాశం ఉండవచ్చిని అంచనా వేస్తుంది. డేటా అంతా ఒకే దగ్గర ఉంటే చోరీకి గురయితే ఎక్కువ ప్రమాదం ఉంటుందనే సందేహాలు ఉన్నాయి. అయితే ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. పూర్తి అధ్యయనం, రక్షణ చర్యలు తీసుకొన్న తరువాతే అమలులోకి వస్తుందని చెబుతున్నారు. ఈ ప్రతిపాదన త్వరలో పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులోకి వస్తుందని తెలిసింది. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలను, అనుమానాలను, సలహాలను ఫిబ్రవరి 27 వరకు చెప్పవచ్చని సమాచారం.

Post a Comment

0 Comments

Close Menu