Ad Code

షియామి ఫోన్లలో సెన్సార్‌షిప్ ఫంక్షన్ లేదు


చైనాకు చెందిన షియామి ఫోన్లలో సెన్సార్‌షిప్ ఫంక్షన్ గురించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని జర్మన్ ఫెడరల్ సైబర్ సెక్యూరిటీ వాచ్‌డాగ్ బీఎస్ఐ స్పష్టం చేసింది. షియామి ఫోన్లలో ఫ్రీ టిబెట్‌, లాంగ్ లివ్ తైవాన్ ఇండిపెండెన్స్‌, డెమొక్రసీ మూవ్‌మెంట్ వంటి పదాలను సెన్సార్ చేసే ఫంక్షన్ ఇన్‌బిల్ట్‌గా ఉందని గత ఏడాది సెప్టెంబర్‌లో లిథుయేనియా స్టేట్ సైబర్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. ఈ ఆరోపణలపై పలు నెలల పాటు విచారణ చేపట్టిన అనంతరం బీఎస్ఐ కీలక ప్రకటన చేసింది. ఈ వ్యవహారంలో తదుపరి దర్యాప్తునకు అవసరమయ్యే ఎలాంటి లోటుపాట్లను తాము కనుగొనలేదని బీఎస్ఐ ప్రతినిధి గురువారం పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu