Ad Code

దూసుకెళ్లిన టాటా మోటార్స్ షేర్!


టాటా మోటార్స్ కొన్ని దశాబ్దాల తర్వాత ఇండియా సెకండ్ లార్స్ట్ కార్ మేకర్‌గా నిలిచింది. సోమవారం నాడు పెరిగిన షేర్ల విలువ హ్యూండాయ్ మోటార్స్ షేర్ ను దాటేసింది. డిసెంబర్ తో పోల్చుకుంటే 50శాతం సేల్స్ పెరిగాయని రికార్డులు చెబుతున్నాయి. సోమవారం నాటికి టాటా మోటార్స్ షేర్లు 4శాతం పెరిగాయి. స్టాక్ 3.59శాతం పెరిగి రూ.499.70 వద్ద నిలిచింది. ఎన్ ఎస్ ఇ లో చూస్తే 3.60శాతం పెరిగి రూ.499.80శాతం పెరిగింది. ఒక్క 2021 డిసెంబర్ నెలలో 35వేల 299యూనిట్ల అమ్మకాలు జరిపింది టాటా మోటార్స్. సంవత్సరం క్రితం అదే డిసెంబర్ నెలలో అమ్మింది కేవలం 23వేల 545యూనిట్లు మాత్రమే. టాటామోటర్స్ ప్రస్తుత మూడో త్రైమాసికంలో అమ్మకాలు జరిపింది 99వేల 2యూనిట్లు. గతేడాది మూడో త్రైమాసికంలో జరిగిన అమ్మకాలు 68వేల 806 యూనిట్లు. దీనిని బట్టే చూస్తే 44శాతం అమ్మకాలు పెరిగినట్లు స్పష్టమవుతోంది.

Post a Comment

0 Comments

Close Menu