Ad Code

బూస్టర్ డోసు తీసుకుంటేనే ఎంట్రీ!


కొవిడ్-19 బూస్టర్ డోసు తీసుకుంటేనే ఉద్యోగులు ఆఫీసులకు రావాలని ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఆదేశించింది. బూస్టర్ డోసు తీసుకోకుండా ఆఫీసులకు రావొద్దని సూచించింది. ఇప్పటికే పలు సోషల్ మీడియా కంపెనీలు బూస్టర్ డోసు షాటును తప్పనిసరి చేశాయి. ఇప్పుడు మెటా యాజమాన్యంలోని సంస్థ ఫేస్ బుక్ కూడా బూస్టర్ షాట్‌ను తప్పనిసరి చేసింది. ఫేస్‌బుక్ ముందుగా జనవరి 31 నాటికి ఫిజికల్ ఆఫీసులను తిరిగి ప్రారంభించాలని భావించింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల పెరుగుదల కారణంగా ఆఫీసుకు ఉద్యోగులు తిరిగి వచ్చే తేదీని మార్చి 28కి పొడిగించింది. ఫేస్‌బుక్ గతంలో ఆఫీస్ డిఫెరల్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఫేస్ బుక్ ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి వచ్చేందుకు అనుమతినిస్తుంది. ఆఫీసు నుంచి పని చేయడానికి ఎంచుకునే ఉద్యోగుల కోసం ఈ ప్రొగ్రామ్ తీసుకొచ్చింది. ముందుగా జనవరి 31గా నిర్ణయించగా.. ఇప్పుడు మార్చి 28కి పొడిగిస్తూ ఫేస్ బుక్ నిర్ణయించింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి వచ్చేందుకు సిద్ధంగా లేరని గుర్తించామని మెటా కంపెనీ వెల్లడించింది. ఉద్యోగుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఏది అనుకూలంగా ఉంటుందో ఎంచుకునే ఆప్షన్లకు అందిస్తున్నట్టు తెలిపింది. ఆఫీసుల్లో నుంచి పనిచేయాలా? లేదా వర్క్ ఫ్రమ్ చేస్తారనేది ఉద్యోగులదే నిర్ణయమని మెటా వైస్ ప్రెసిడెంట్ జానెల్లే గేల్ పేర్కొన్నారు. అమెరికాలోని ఫేస్‌బుక్ ఉద్యోగులందరిని కోవిడ్‌ టీకాలు తీసుకోవాలని మెటా కోరుతోంది. ఫేస్‌బుక్ ఉద్యోగులకు ఆఫీస్ నుంచి పని చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు.. ఇందుకు మార్చి 14 వరకు ఉద్యోగులకు సమయం ఉందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. బూస్టర్ డోసు తీసుకునేందుకు ఆసక్తిగా లేనివారు రిమోట్‌గా ఫుల్ టైం పనిచేయాలని సూచించే అవకాశం ఉంది. తాత్కాలికంగా ఇంటి నుంచి పనిచేయమని కంపెనీ కోరే అవకాశం ఉంది. ఆరోగ్యం లేదా మతపరమైన కారణాల వల్ల టీకాలు వేయని ఉద్యోగులు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేయమని కోరవచ్చు. లేదంటే ఉద్యోగుల తొలగింపుతో సహా క్రమశిక్షణా చర్యలను విధించే అవకాశం ఉండొచ్చునని కంపెనీ ప్రతినిధి చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu