Ad Code

అమెజాన్ కు ట్విట్టర్‌లో భారీ నిరసన


రిపబ్లిక్ డేకి ముందు భారత జాతీయ జెండా ముద్రలతో ఉత్పత్తులను విక్రయించినందుకు అమెజాన్ ట్విట్టర్‌లో భారీ నిరసన ఎదుర్కొంటోంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ భారత జెండా చిత్రాలతో ఆహార, దుస్తుల ఉత్పత్తులను అమ్మకానికి ఉంచింది. కొంతమంది కొనుగోలుదారులు దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ అమెజాన్‌ను బహిష్కరించండి అంటూ హ్యాష్‌ట్యాగ్‌లను ట్విట్టర్‌లో ట్రెండ్ చేయడం ప్రారంభించారు. చాక్లెట్లు, ఫేస్ మాస్క్‌లు, సిరామిక్ మగ్‌లు, కీచైన్‌లు, పిల్లల దుస్తులు వంటి వస్తువులపై జెండా ముద్ర ఉందని, ఇది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002కి విరుద్ధమని త్రివర్ణ పతాకాన్ని అటువంటి రూపంలో ఉపయోగించడం అవమానకరమని, జాతీయ జెండా కోడ్‌ను ఉల్లంఘించడమేనని వినియోగదారులు అంటున్నారు. ఇటీవల భారత జాతీయ జెండా చిత్రంతో బూట్లు సహా ఉత్పత్తులను విక్రయిస్తున్నందుకు అమెజాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. ఈ విషయంపై హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ అమెజాన్ విక్రయిస్తున్న ఉత్పత్తులపై మన జాతీయ జెండాను ఉపయోగిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇది జాతీయ జెండా కోడ్‌ను ఉల్లంఘించడమేనని మిశ్రా అన్నారు. అమెజాన్ అధికారులు, యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిజిపిని ఆదేశించామని తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu