Ad Code

మొబైల్ ఫోన్లు, పెద్ద టీవీల ధరలు తగ్గబోతున్నాయా?

 


బడ్జెట్ 2022పై వేతన జీవులు, బ్యాంకులు, రిటైలర్లు, ఫిన్‌టెక్ సంస్థలు సహా అనేక రంగాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఈ బడ్జెట్ ప్రతి సెక్టార్‌కు కీలకంగా మారనుంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్ రంగంలో ముఖ్యమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. స్థానిక తయారీని ప్రోత్సహించడానికి వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్‌ల పార్ట్స్ లేదా సబ్-పార్ట్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం సవరించబోతోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మొబైల్ ఫోన్‌లు, పెద్ద టీవీలు ఈ ఏడాది నుంచి తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని సవరించడం వల్ల బడ్జెట్ 2022 సమయంలో ఎలక్ట్రానిక్ రంగం మెరుగుపడుతుంది. అయితే వినియోగదారుల కోసం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు విక్రయించే రిటైలర్లు ఇతర డిమాండ్‌లు వినిపిస్తున్నారు. "2022-23 బడ్జెట్‌తో అసమానతను తగ్గించడానికి ముడి పదార్థాల ధరలకనుగుణంగా ప్రభుత్వం అన్ని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై జీఎస్‌టీని తగ్గించాలని ఆశిస్తున్నాం. ప్రత్యేకించి ఈరోజుల్లో ఎలక్ట్రానిక్‌ వస్తువులను అందరూ నిత్యావసరాలుగా భావిస్తున్నారు." అని వెస్టింగ్‌హౌస్ టీవీ ఇండియా బ్రాండ్ లైసెన్సీ సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్  వైస్ ప్రెసిడెంట్ పల్లవి సింగ్ అన్నారు. 2022 బడ్జెట్‌లో టెలివిజన్‌లపై జీఎస్‌టీ తగ్గింపు అవసరమని ఆమె అన్నారు. "32 అంగుళాల వరకు ఉన్న టెలివిజన్‌లపై ప్రస్తుతం 18 శాతం జీఎస్‌టీ అమలవుతోంది. 28 శాతం రేటు పరిధిలోకి వచ్చే టెలివిజన్‌లు కూడా ఉన్నాయి. 43 అంగుళాల వరకు ఉన్న టెలివిజన్‌లలో కూడా 18 శాతానికి రేటును తగ్గించడం వల్ల వినియోగదారులకు పెద్ద ఊరట కల్పించినట్లు అవుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులు 32 నుంచి 43 రేంజ్ లోనే టీవీలను కొనుగోలు చేస్తారు," అని సింగ్ తెలిపారు. "ప్రస్తుతం మనం మరొక కరోనా వేవ్ కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో ఆత్మ నిర్భర్ భారత్ ఎంత ముఖ్యమో తెలుస్తోంది. భారతీయ తయారీ, MSMEలను పెంచడానికి... మాకు స్థిరమైన జీఎస్‌టీ పన్ను స్లాబ్ అవసరం. ఏ ఉత్పత్తి 18 శాతం స్లాబ్‌కు మించకూడదు. మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరచడానికి వారు ఇప్పుడు వినియోగదారులను ప్రోత్సహించాలి" అని ఓ కంపెనీ అధికారి వెల్లడించారు. "ఇలా చేయడం ద్వారా భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద టీవీ మార్కెట్‌గా అవతరిస్తుంది. మార్కెట్ పరిమాణం ఏటా 15 శాతం వృద్ధి చెంది 16 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది. పరిశ్రమ స్థిరమైన స్థితికి వెళుతున్నందున, ప్రస్తుతానికి ఎలాంటి కస్టమ్స్ సుంకాలను మార్చవద్దని మేం ప్రభుత్వాన్ని కోరుతున్నాం," అని సదరు అధికారి చెప్పుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలను ప్రభుత్వం పెంచాలని పల్లవి సింగ్ అభిప్రాయపడ్డారు. "ప్రపంచంలో ప్రస్తుత సెమీకండక్టర్ కొరత దృష్ట్యా, మన ప్రభుత్వం ఎలక్ట్రానిక్ రంగానికి సహాయం చేయాలి. ఎలక్ట్రానిక్స్‌పై జాతీయ విధానం కింద పథకాలను అందించాలి. అవసరమైన పెట్టుబడి పరిమాణం భారీగా ఉన్నందున, ఒక సంస్థపై భారాన్ని తగ్గించడానికి పన్ను రాయితీ పథకాల ద్వారా కూడా మద్దతు ఇవ్వాలి." అని ఆమె అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu