Ad Code

బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ అంటే ఏంటి?


బ్లాక్‌చైన్ టెక్నాలజీకి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. కానీ.. టెక్నికల్ డెఫినేషన్స్ మనకు అవసరం లేదు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బ్లాక్‌చైన్ టెక్నాలజీ అంటే హైఎండ్ సెక్యూరిటీతో డేటాను స్టోర్ చేయడం. దాని కోసం వాడే టెక్నాలజీయే ఇది. హైఎండ్ సెక్యూరిటీతో డేటాను స్టోర్ చేసే ఎన్నో డేటాబేస్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి కదా.. స్పెషల్‌గా ఈ బ్లాక్‌చైన్‌కు ఎందుకంత క్రేజ్ అనే ప్రశ్న కూడా రావచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల డేటాబేస్‌లు అందుబాటులో ఉన్నా.. అవేవీ నూటికి నూరు శాతం సెక్యూర్డ్ కాదు. అలాగే.. వాటిని హ్యాక్ చేయొచ్చు. డేటాబేస్‌లోని డేటాను మార్చొచ్చు. ఇలా ఎన్నో రకాలుగా డేటా ప్రైవసీకి భంగం కలిగే అవకాశాలు ఉంటాయి. చాలా కంపెనీలు ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఫైనాన్సియల్‌కు సంబంధించిన డేటాకు హైఎండ్ సెక్యూరిటీ ఇస్తారు. అయినా కూడా వాటిని హ్యాక్ చేసే చాన్సెస్ ఉంటాయి. కానీ.. ఎప్పుడైతే బ్లాక్‌చైన్ టెక్నాలజీతో డేటాను స్టోర్ చేస్తారో.. ఆ డేటాను హ్యాక్ చేసే చాన్స్ అస్సలు ఉండదు. ఆ డేటాలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం ఉండదు. మరీ ముఖ్యంగా డేటాలో పారదర్శకత ఉంటుంది. ఫ్రాడ్స్ జరిగే చాన్సెస్ అస్సలు ఉండవు. అందుకే.. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన డేటా స్టోర్ చేయడానికి బ్లాక్‌చైన్ టెక్నాలజీని వాడుతున్నారు. నిజానికి బ్లాక్‌చైన్ టెక్నాలజీ అనేది కొత్తదేమీ కాదు. చాలా ఏళ్ల నుంచి ఉన్నదే. పలు కంపెనీలు ఈ టెక్నాలజీని వాడుతున్నాయి. కానీ.. ఎప్పుడైతే బిట్‌కాయిన్ కోసం ఈ టెక్నాలజీని వాడటం మొదలు పెట్టారో.. దీనికి ఒక్కసారిగా బూమ్ పెరిగింది. ఎక్కడ చూసినా దీని గురించే వినిపిస్తోంది. అందుకే.. బ్లాక్‌చైన్ గురించి అందరూ తెలుసుకోవడం మొదలు పెట్టారు. బ్లాక్ చైన్ టెక్నాలజీని అన్ని డొమైన్స్‌లో వాడొచ్చు. ఉదాహరణకు బ్యాంకింగ్, హెల్త్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఈకామర్స్ లాంటి డొమైన్స్‌లో దీన్ని వాడొచ్చు. చాలా కంపెనీలు ప్రస్తుతం బ్లాక్‌చైన్ టెక్నాలజీనే వాడుతున్నాయి. ఎథీరియం స్మార్ట్‌కంట్రాక్ట్ టెక్నాలజీ ద్వారా బ్లాక్‌చైన్ ప్రాజెక్ట్‌లను డెవలప్ చేస్తారు. ఈ టెక్నాలజీ ద్వారా డేటాను బ్లాక్స్‌లో స్టోర్ చేస్తారు. చైన్ ఆఫ్ బ్లాక్స్‌లో స్టోర్ చేసి.. ఒక్కో బ్లాక్‌ను అనుసంధానం చేస్తారు. ఒక్కో బ్లాక్‌లోని డేటా ఒక్కో సర్వర్‌లో స్టోర్ అవుతుంది. దీని వల్ల.. ఈ డేటా హ్యాక్ అయ్యే చాన్స్ అస్సలు ఉండదు. ఒకవేళ హ్యాకర్ ఒక బ్లాక్‌ను యాక్సెస్ చేసుకున్నా.. దాన్ని మార్చేందుకు ప్రయత్నించినా.. తస్కరించేందుకు ప్రయత్నించినా.. ఇతర సర్వర్లలో ఉన్న బ్లాక్స్‌కు సమాచారం అందుతుంది. బ్లాక్‌చైన్‌లో డేటా హాష్ రూపంలో స్టోర్ అవుతుంది. హాష్ అనేది ఒక కోడ్ అన్నమాట. ఆ కోడ్‌ను హ్యాకర్ యాక్సెస్ చేసుకున్నా.. అసలైన డేటాను మాత్రం హ్యాకర్ దొంగలించలేడు. చాలా సందర్భాల్లో జరిగే ఫైనాన్సియల్ ఫ్రాడ్స్‌, డేటా ఫ్రాడ్స్‌ను ఈ టెక్నాలజీ ద్వారా అరికట్టవచ్చు. భవిష్యత్తులో ఇంట్లోనే కూర్చొని ఓటింగ్ వేసే సదుపాయం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్నే బీఈవో అంటారు. అంటే బ్లాక్ చైన్ ఎలక్ట్రానిక్ వోటింగ్. ఈ టెక్నాలజీ ద్వారా ఓటింగ్ సిస్టమ్‌ను డెవలప్ చేసి.. ప్రతి ఓటర్‌కు ఒక హాష్ కోడ్ ఇస్తారు. ఆ హాష్ కోడ్ ద్వారా ఇంట్లోనే కూర్చొని మొబైల్, సిస్టమ్ ద్వారా నచ్చిన వ్యక్తికి ఓటు వేయొచ్చు. ఒక్కసారి ఓటర్ ఓటు వేయగానే అది బ్లాక్స్‌లో స్టోర్ అవుతుంది. దాన్ని మార్చే వీలు అస్సలు ఉండదు. ఒకరి పేరుతో మరొకరు ఓటు వేసే చాన్స్ అస్సలు ఉండదు. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు.. ఓట్ల ట్యాంపరింగ్ లాంటి ఫ్రాడ్స్‌ను ఈ టెక్నాలజీ ద్వారా అరికట్టవచ్చు.


Post a Comment

0 Comments

Close Menu