Ad Code

వాట్సప్‌తో యూపీఐ పిన్‌ మార్చుకొనే అవకాశం !


మెసేజింగ్ ప్లాట్‌ఫాం అయిన వాట్సప్ మనీ ట్రాన్సఫర్ చేసేందుకు కూడా ఫీచర్ తెచ్చింది. యూపీఐ పిన్ మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఈ ఫీచర్ కు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) నుంచి అప్రూవల్ దక్కించుకుంది. ఆండ్రాయిడ్  ఫోన్‌లో వాట్సప్‌ యాప్‌ని ఓపెన్ చేసి కుడివైపు పైభాగంలోని ఆప్షన్లపై నొక్కి, పేమెంట్స్‌పై నొక్కండి. పేమెంట్ సెక్షన్స్ కింద, యూపీఐ పిన్ నంబర్‌ను మార్చాలనుకుంటున్న బ్యాంక్ అకౌంట్ సెలక్ట్ చేసుకొని యూపీఐ పిన్ చేంజ్ ఆప్షన్‌పై నొక్కండి. యూపీఐ పిన్‌ని నమోదు చేసి, ఆపై కొత్త యూపీఐ పిన్‌ని నమోదు చేయండి. కొత్త యూపీఐ పిన్ నంబర్‌ని నిర్ధారించండి. యూపీఐ పిన్ మర్చిపోతే పర్గేట్ యూపీఐ పిన్‌పై నొక్కండి. కంటిన్యూ ఎంచుకుని, మీ డెబిట్ కార్డ్ నంబర్ యొక్క చివరి 6-అంకెలు మరియు చివరి తేదీని నమోదు చేయండి (కొన్ని బ్యాంకులు మీ CVV నంబర్‌ను కూడా అడగవచ్చు). ఆ తర్వాత మీరు మీ యూపీఐ పిన్‌ని రీసెట్ చేసుకోండి. 

Post a Comment

0 Comments

Close Menu