Ad Code

డెస్క్‌టాప్ వెర్షన్‌లో వాయిస్ రికార్డింగ్స్ ప్రివ్యూ టెస్టింగ్


మెటా యాజమాన్యంలోని ఇన్​స్టంట్​ మెసేజింగ్ యాప్ వాట్సాప్​ కొత్త ఫీచర్​ను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ప్రత్యర్థి సంస్థలకు దీటుగా కొత్త ఫీచర్లతో తన యూజర్ల సంఖ్యను​ పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే వాట్సాప్ ఇటీవల టెస్టర్లకు వాయిస్​ నోట్స్​ను రివ్యూ చేసే ఫీచర్​ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్​ ద్వారా యూజర్లు వారి కాంటాక్ట్స్​కు మెసేజ్​ పంపే ముందు వాయిస్ నోట్స్‌ని రివ్యూ చేసుకునే వెసులుబాటు కల్పించింది. తాజాగా ఈ ఫీచర్​ను డెస్క్‌టాప్ వెర్షన్​లకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ ఈ కొత్త అప్‌డేట్‌ను గుర్తించింది. ఈ ఫీచర్​ స్క్రీన్‌షాట్స్‌ను తన బ్లాగ్ పోస్ట్‌లో షేర్ చేసింది. ఇప్పటికే ఐఓఎస్​ యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్​ అతి త్వరలోనే ఆండ్రాయిడ్​ యూజర్లకు సైతం అందుబాటులోకి రానుంది. వాట్సాప్​ ఫీచర్స్ ట్రాకర్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్​ ప్రకారం, ఎవరికైనా వాయిస్​ నోట్​ను పంపే ముందు ఆ వాయిస్ నోట్‌ని పాజ్ చేసి వినవచ్చు. దీని కోసం కొత్త పాజ్ బటన్​ను చేర్చనుంది. మరోవైపు, వినియోగదారులు ఈ వాయిస్​ నోట్​ను డిలీట్​ చేయవచ్చు లేదా రికార్డింగ్‌ను పాజ్​​ చేయవచ్చు. వాయిస్​ నోట్​లో ఉన్న స్టాప్​ బటన్​ పాజ్ బటన్​గా పనిచేస్తుంది. అయితే, దీనిలో సెండ్ బటన్‌ను నొక్కే ముందు యూజర్​ మొదటి నుంచి మొత్తం వాయిస్ రికార్డింగ్‌ను వినాల్సి ఉంటుంది. త్వరలోనే బీటా వెర్షన్ 2.21.230.16 లో ఈ ఫీచర్​ కనిపించనుంది. వాట్సాప్​ వాయిస్​ నోట్​లో మరో ఇంట్రస్టింగ్ ఫీచర్​ను కూడా పరిచయం చేయనున్నట్లు సమాచారం. యూజర్స్​ బ్యాక్​గ్రౌండ్​లోనే వాయిస్​ మెసేజ్​ వినేందుకు ఈ ఫీచర్​ వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం వాయిస్​ మెసేజ్​ ప్లే చేసి చాట్​ పేజీ నుంచి బయటకు వస్తే ఆడియో ఆటోమేటిక్​గా ఆగిపోతుంది. అయితే, త్వరలో అందుబాటులోకి రానున్న ఫీచర్​తో వాయిస్​ మెసేజ్​ ప్లే చేసి, ఎంచక్కా ఇతరులతో చాట్​ చేస్తూ ఆడియో వినవచ్చు. మనం ప్లే చేసిన వాయిస్​ మెసేజ్​ చాట్​ పేజీ పై భాగంలో కనిపిస్తుందని వాట్సాప్​ బీటా ఇన్ఫో వెల్లడించింది. ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తే ఇకపై యూజర్లు ఆడియో వింటూనే ఇతరులతో చాటింగ్​ చేయవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu