Ad Code

ఒక్క నిమిషంలో రెండు గంటల సినిమా డౌన్‌లోడ్


ఈ ఏడాది చివరినాటికి భారత్‌లో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది. ఈ సేవలకు సంబంధించి ఇప్పటికే చురుకుగా పనులు సాగుతున్నాయి. ముందుగా దేశంలోని 13 మెట్రో నగరాల్లో 5జీ సేవలు మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టెలికమ్యూనికేషన్స్ శాఖ (డాట్) ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ విషయంలో సంచలనాలు క్రియేట్ చేసిన జియో.. 5G రేసులో ముందు వరసలో కనిపిస్తోంది. 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కస్టమర్లకు అందించాలని దేశంలోని 1000 నగరాల్లో 5జీ నెట్‌వర్క్ అందించేందుకు ప్లాన్‌ కూడా సిద్ధం చేసింది జియో. ఈ క్రమంలోనే 5జీ ట్రయల్స్‌ నిర్వహించింది సంస్థ. దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఓ స్క్రీన్‌షాట్‌ మాత్రం లీక్ అయ్యింది. లీకైన సమాచరం ప్రకారం చూస్తే.. 4జీ నెట్‌వర్క్ కంటే 5జీ నెట్‌వర్క్ డౌన్‌లోడ్ స్పీడ్ 8రెట్లు వేగంగా ఉన్నట్లు అర్థం అవుతోంది. 420Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌తో.. 412Mbps అప్‌లోడ్ స్పీడ్‌ జీయో నెట్‌‍వర్క్‌లో ఉంది. 4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే ఇది 15రెట్లు అధికం కాగా.. ఈ స్పీడ్‌తో కేవలం ఒక్క నిమిషంలో రెండు గంటల సినిమాని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముంబై నగరంలో జియో 5జీ నెట్‌వర్క్ టెస్ట్ జరిగింది. జియో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ 46.82ఎంబీపీఎస్, అప్‌లోడ్ స్పీడ్ 25.31ఎంబీపీఎస్‌గా ఉంది. ఈ డేటాతో పోలిస్తే 5జీ నెట్‌వర్క్ డౌన్‌లోడ్ 8రెట్లు, అప్‌లోడ్ 15 రెట్లు వేగంగా ఉంది. అయితే, ట్రయల్స్‌ సమయంలో వచ్చిన ఫలితాలకు వాస్తవ రూపంలో వాడకంలోకి వచ్చే వేగంలో మార్పులు ఉంటాయి. గతంలో 4జీ విషయంలో కూడా అదే జరిగింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, గురుగ్రామ్, చండీగఢ్, బెంగుళూరు, అహ్మదాబాద్, జామ్‌నగర్, హైదరాబాద్, పూణే, లక్నో, గాంధీనగర్‌లతో సహా కొన్ని నగరాల్లో 5G లాంచ్ జరుగుతుందని DoT ఇప్పటికే ధృవీకరించింది. హెల్త్‌కేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌లో అధునాతన వినియోగం కోసం ఆయా రంగాల్లో 5జీ నెట్‌వర్క్‌ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు జియో వెల్లడించింది. అయితే, 5జీ వస్తే మాత్రం ఆ నెట్‌వర్క్ ప్లాన్‌ల రేట్లు బాగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu